Begin typing your search above and press return to search.

రౌడీతో అమెరికా టూర్ ఆమె ఎప్పటికి మర్చిపోలేదట!

By:  Tupaki Desk   |   14 May 2022 11:30 PM GMT
రౌడీతో అమెరికా టూర్ ఆమె ఎప్పటికి మర్చిపోలేదట!
X
బాలీవుడ్ లో సీనియర్ స్టార్ నటుడు అయిన చుంకీ పాండే కూతురు అనన్య పాండే. ఈ అమ్మడు బాలీవుడ్‌ లో ఎంట్రీ ఇచ్చి చాలా తక్కువ సమయంలోనే తన అందంతో స్టార్‌ డమ్ ను దక్కించుకుంది. తండ్రి వారసత్వంతో ఇండస్ట్రీలో అడుగు పెట్టిందే కాని ఆమె తన సొంత ప్రతిభతోనే స్టార్‌ డమ్‌ ను దక్కించుకుంది. హీరోయిన్ గా ఆమె తెలుగు లో లైగర్ సినిమా తో ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం అయ్యింది.

రౌడీ స్టార్‌ విజయ్‌ దేవరకొండ హీరోగా నటించిన లైగర్ సినిమాలో అనన్య పాండే హీరోయిన్ గా నటించిన విషయం తెల్సిందే. హీరోయిన్ గా ఆమె నటించిన లైగర్ విడుదలకు సిద్దం అయ్యింది. ఆగస్టులో విడుదల కాబోతున్న లైగర్‌ సినిమా పై చాలా నమ్మకంగా ఉన్నట్లుగా ఆమె తాజాగా ఒక చిట్‌ చాట్ లో వ్యాఖ్యలు చేసింది. అనన్య పాండే పాత్ర లైగర్ లో అత్యంత కీలకంగా ఉంటుందని కూడా ఆమె మాటలను బట్టి అనిపిస్తోంది.

అనన్య పాండే మాట్లాడుతూ.. పూరి సర్ దర్శకత్వంలో విజయ్ తో కలిసి నటించడం చాలా ఆనందాన్ని కలిగించింది. విజయ్ మంచి వ్యక్తి. ఆయన తో నాకు మంచి స్నేహం ఏర్పడింది. ఇద్దరం షూటింగ్ సమయంలో చాలా ఎంజాయ్ చేసేవాళ్లం. ఏమాత్రం బ్రేక్ దొరికినా కూడా చాలా విషయాలను ముచ్చటిస్తూ సరదాగా సమయాన్ని గడిపేవాళ్ళం. ఎన్నో సంగతులను గురించి చర్చించుకుంటూ సమయం తెలియకుండా మాట్లాడుకుంటూ ఉండేవాళ్లం.

లైగర్‌ సినిమా షూటింగ్ కోసం అమెరికా వెళ్లాం. ఆ షెడ్యూల్‌ ను నేను ఎప్పుడు కూడా మర్చిపోలేను. అమెరికా షెడ్యూల్‌ ను ప్రతి ఒక్కరం బాగా ఎంజాయ్‌ చేశాం. అక్కడ వర్క్ చేసిన వారితో మంచి అనుభవం దక్కిందని అనన్య పాండే చెప్పుకొచ్చింది. ఇప్పటికే తన పార్ట్‌ షూటింగ్‌ ను ముగించాను అని.. డబ్బింగ్‌ కూడా చెప్పేశాను అంటూ అనన్య ఇంటర్వ్యూలో పేర్కొంది.

పూరి జగన్నాద్‌ స్వీయ దర్శకత్వంలో ఛార్మి మరియు కరణ్‌ జోహార్ లతో కలిసి భారీ బడ్జెట్‌ తో లైగర్ ను నిర్మించిన విషయం తెల్సిందే. ఇటీవలే విజయ్ దేవరకొండ స్పందిస్తూ కెరీర్‌ లో అతి పెద్ద సినిమా లైగర్ అంటూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టాడు.

లైగర్ సినిమా స్థాయి చూస్తుంటే తప్పకుండా ఒక మంచి మాస్ ఎంటర్ టైనర్‌ గా మాత్రమే కాకుండా అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే విధంగా ఉంటుందనే నమ్మకం కలుగుతోంది. లైగర్ తో సౌత్‌ లో ఎంట్రీ ఇవ్వబోతున్న అనన్య పాండే ఇక్కడ కంటిన్యూ అయ్యేనా అనేది చూడాలి.