ఫొటోటాక్ : రత్నాని కెమెరాలో రౌడీ బ్యూటీ అందాలు

Wed Jun 16 2021 12:00:26 GMT+0530 (IST)

Ananya Pandey Latest Stunning Pose

బాలీవుడ్ తో పాటు సౌత్ స్టార్స్ ఫొటో షూట్ లను కూడా చేసే డబ్బూ రత్నాని ప్రతి ఏడాది ఎంతో మంది సెలబ్రెటీలను కొత్తగా మరింత అందంగా చూపిస్తూ ఉంటాడు. గత ఏడాది కియారా అద్వానీ ఫొటో షూట్ ఎంతటి ట్రెండ్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ ఏడాది కూడా డబ్బూ రత్నాని క్యాలెండర్ స్టిల్స్ ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. పలువురు బాలీవుడ్ స్టార్స్ తో పాటు సౌత్ స్టార్స్ ఫొటోస్ కూడా నెట్టింట సందడి చేస్తున్నాయి. ఇటీవలే విజయ్ దేవరకొండ ఫొటో షూట్ వైరల్ అవ్వగా తాజాగా ఆయనతో లైగర్ సినిమాలో నటిస్తున్న అనన్య పాండే ఫొటో షూట్ చేసింది.డబ్బూ రత్నాని ఫొటో షూట్ తో అనన్య పాండే మరింత అందంగా కనిపిస్తుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. షర్ట్ బటన్ విప్పి క్లీవేజ్ షో తో పాటు థైస్ అందంను ఎక్స్ పోజింగ్ చేస్తున్న అనన్య పాండే అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. నిజంగా డబ్బూ రత్నాని కెమెరాలో మ్యాజిక్ ఉంది. ఆయన ఏదైనా చేస్తాడంటూ అతడి కెమెరాకు నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. క్యూట్ పప్పీతో పాటు ఆకట్టుకునే నవ్వుతో అందమైన బాడీ పొజీషన్ తో అనన్య ఫొటో ఆకట్టుకుంది.

లైగర్ సినిమా తో పాటు బాలీవుడ్ లో మరో రెండు సినిమాలను కూడా ఈమె చేస్తున్నట్లుగా తెలుస్తోంది. స్టార్ కిడ్ అనే ముద్రతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ అమ్మడు తన ట్యాలెంట్ తో ఆకట్టుకుంది. లైగర్ సినిమా తో తెలుగు ప్రేక్షకుల కూడా తప్పకుండా ఆమెను ఆధరిస్తారని.. ఇక్కడ కూడా స్టార్ హీరోయిన్ గా మారడం ఖాయం అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు చాలా నమ్మకంతో ఉన్నారు.