Begin typing your search above and press return to search.

పిక్ టాక్‌ : ఇంత అందం ఆశలన్నీ లైగర్‌ మీదే

By:  Tupaki Desk   |   15 Jan 2022 4:39 AM GMT
పిక్ టాక్‌ : ఇంత అందం ఆశలన్నీ లైగర్‌ మీదే
X
బాలీవుడ్ లో ఈ మద్య కాలంలో తెగ పాపులర్ అవుతున్న ముద్దుగుమ్మ అనన్య పాండే. వారసత్వంతో బాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చినా కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకునేందుకు చాలానే కష్టపడింది.. ఇంకా కష్టపడుతూనే ఉంది. ఆమెకు వచ్చింది ఏది ఊరికే రాలేదు. ఖచ్చితంగా ఆమె కష్టపడి దక్కించుకుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రతి ఒక్క సినీ అభిమాని మరియు ఇండస్ట్రీ వర్గాల వారు ఆమె ప్రతిభ గురించి మాట్లాడుతూనే ఉంటారు. అందంతో పాటు అభినయం ఇలా పలు విధాలుగా ఆకట్టుకుంటూనే ఉంది. తాజాగా లైగర్ బ్యూటీ తెలుగు ఎంట్రీ ఇస్తుంది.

పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న విజయ్‌ దేవరకొండ.. పూరి జగన్నాద్‌ ల లైగర్‌ సినిమా లో హీరోయిన్ గా ఈ అమ్మడు నటిస్తున్న విషయం తెల్సిందే. లైగర్‌ పై ఈ అమ్మడు చాలా ఆశలు పెట్టుకుంది. నటిగా అందగత్తెగా గుర్తింపు దక్కించుకున్న అనన్య పాండే కమర్షియల్‌ గా బిగ్గెస్ట్‌ బ్లాక్ బస్టర్ కోసం వెయిట్‌ చేస్తుంది. ప్రస్తుతం చేస్తున్న లైగర్‌ సినిమా విజయం సాధిస్తే అటు బాలీవుడ్ తో పాటు ఇటు సౌత్‌ లో కూడా గుర్తింపు దక్కుతుంది. తద్వారా తన క్రేజ్ మరింత పెరుగుతుందని భావిస్తుంది. అందుకే ఈ అమ్మడు లైగర్‌ సినిమా హిట్‌ కోసం ఆశలు పెట్టుకుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

లైగర్ సినిమాలో విజయ్ దేవరకొండ తో ఈ అమ్మడి డ రొమాన్స్ ఓ రేంజ్ లో ఉంటుందని అభిమానులు నమ్మకంగా ఉన్నారు. ఇప్పటికే వీరిద్దరి కాంబోలో వచ్చిన స్టిల్స్ మరియు కొన్ని లీక్ అయిన వీడియోలను చూస్తుంటే పూరి జగన్నాద్‌ మార్క్ రొమాన్స్ ఫుల్‌ గా ఉంటుందనిపిస్తుంది. బాలీవుడ్‌ లో కరణ్ జోహార్ ఈ సినిమాను ప్రమోట్‌ చేయడం మాత్రమే కాకుండా నిర్మాణ భాగస్వామిగా కూడా ఉన్నాడు. ఈ సినిమా పై ఆయనకు ఉన్న నమ్మకం చూస్తుంటే తప్పకుండా సినిమా ఘన విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకంను బాలీవుడ్ సర్కిల్స్ వారు వ్యక్తం చేస్తున్నారు.

రికార్డు బ్రేకింగ్‌ వసూళ్లను లైగర్‌ దక్కించుకుంటే విజయ్ దేవరకొండ పాన్‌ ఇండియా స్టార్‌ గా మారడంతో పాటు అనన్య పాండేకు అక్కడ ఇక్కడ వరుస ఆఫర్లు అది కూడా భారీ పారితోషికంతో దక్కడం ఖాయం. సోషల్‌ మీడియాలో ఇప్పటికే అందాల ఆరబోత ఫొటో షూట్ తో సౌత్‌ లో మంచి ఫాలోయింగ్‌ ను దక్కించుకున్న ఈ అమ్మడు తాజాగా షేర్‌ చేసిన ఈ ఫొటో ఆమె గురించి మరింతగా మాట్లాడుకునేలా చేసిందనడంలో సందేహం లేదు.