ఏమున్నాయని చూడాలి పాండే?

Mon Feb 17 2020 11:00:31 GMT+0530 (IST)

Ananya Pandey Glamourous Pose

బాలీవుడ్ లో స్టార్ కిడ్స్ రచ్చ ఓ రేంజ్ లో ఉంటుంది.  అటు హీరోలు ఇటు హీరోయిన్లుగా బాలీవుడ్ ను ఒక ఊపు ఊపుతూ ఉంటారు.  గంప గయ్యాళి లాంటి కంగనా లాంటి కొందరు నెపోటిజం అంటూ కెవ్వుకేకలు పెట్టినా ఈ స్టార్ కిడ్స్ కు చీమ కుట్టినట్టు కూడా ఉండదు.  అయినా కంగనా కూడా అదే బాపతు కదా?  కంగనా స్వయంగా కష్టపడి పైకి వచ్చింది కానీ ఈమధ్య తన సోదరుడు అక్షిత్ రనౌత్ ను నిర్మాతగా ప్రమోట్ చేస్తోంది.  అదేంటని అడిగితే న్యూయార్క్ లో ఫిలింమేకింగ్ కోర్సు చేశాడని 'టాలెంట్' అని చెప్తోంది. నిజమే తన దాకా వస్తే కానీ తత్త్వం బోధపడదు అనేది అందుకే.ఈ గోల ఇలా ఉంటే స్టార్ కిడ్స్ హంగామా మరోరకంగా ఉంది.  సీనియర్ బాలీవుడ్ నటుడు చుంకీ పాండే కూతురు అనన్య పాండే ఇప్పటికే హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.  'స్టూడెంట్ అఫ్ ది ఇయర్ 2' అనన్య డెబ్యూ ఫిలిం. ఆ తర్వాత 'పతి పత్ని ఔర్ ఓ' లో కూడా నటించింది. ప్రస్తుతం మరో సినిమా లైన్ లో ఉంది.  అనన్య హీరోయిన్ గా నిలదొక్కుకునే ప్రయత్నాలు చేస్తుండగానే అనన్య చిట్టి చెల్లి అలన పాండే బాలీవుడ్ తాట తీసేందుకు రెడీ అవుతోంది.

అనన్య లుక్స్ వైజ్ మంచి మార్కులు తెచ్చుకుంది. గ్లామర్ బ్యూటీగా కూడా ఫోటోషూట్లు చేస్తూ దుమ్ములేపుతూ ఉంటుంది. అనన్య చెల్లి అలన ఇంకా హీరోయిన్ కాకముందే ఈ ఫోటోషూట్ల జింతాత జితజత మొదలుపెట్టింది.   అక్క అనన్య.. తోటి అక్కబోటి మరో హాటు బ్యూటీ దిశా పటానికి పోటీ ఇవ్వాలని డిసైడ్ అయిందేమో  కానీ ఏకంగా ఇన్నర్ వేర్ ఫోటో షూట్ లు చేసి హీటు పెంచుతోంది.  లుక్స్ బాగానే ఉన్నాయి కానీ హీరోయిన్లు.. మోడల్స్ కు అవసరమైన తీరైన ఒంపుసొంపులు మాత్రం లేవు.  దీంతో నెటిజన్లు కొందరు డైరెక్ట్ గా నే బాడీ షేమింగ్ కు దిగుతున్నారు.  అసలు ఏమున్నాయని చూడాలి పాండే అంటూ ప్రశ్నిస్తున్నారు. అంతః సౌందర్య ఆరాధకుల సున్నితమైన మనోభావాలు దెబ్బతిన్నాయి!