హెయిర్ కటింగ్ లో మెళకువలు నేర్చుకున్న బ్యూటీ

Fri May 13 2022 09:00:02 GMT+0530 (IST)

Ananya Panday Latest Photo

`లైగర్` ఫేం అనన్య పాండే తన సిబ్బందికి హెయిర్ డ్రస్సర్ గా మారింది. ఈ క్యూటీ ఏం చేసినా అది సంథింగ్ స్పెషల్ అని చెప్పాలి. ఒక రోజు క్రితం అనన్య పాండే  ఫరా ఖాన్ తో కలిసి ఒక ఉల్లాసకరమైన వీడియో చిత్రీకరణలో పాల్గొంది. దీని కోసం సెట్లో సిబ్బందిని కూడా కలిగి ఉంది. ఇప్పుడు కొత్త వీడియోలో లైగర్ బ్యూటీని ఒక రకమైన రోల్ రివర్సల్ లో మనం చూడవచ్చు. ఆమె తన టీమ్ మెంబర్ లలో ఒకరికి హెయిర్ స్టైలిస్ట్ గా మారింది.తన సిబ్బందిని తన కుటుంబంలా చూసుకునే అనన్య పాండే ఇప్పుడిలా ఆశ్చర్యపరిచేలా విభిన్నమైన పాత్రను పోషించినట్లు తెలుస్తోంది. మిగిలిన బృందంతో పాటు నటి సిబ్బందిలో ఒకరి జుట్టును కత్తిరించి స్టైలింగ్ చేయడం కనిపించింది. దీన్ని ఎలా చేయాలో ఆమెకు కచ్చితంగా తెలియనప్పటికీ మొదట్లో దాని కోసం శిక్షణ పొందడం కనిపించింది. ఆపై అనన్య స్వయంగా తన చేతులను ఉపయోగిస్తూ ప్రయత్నించింది. అందరినీ ఆకట్టుకునే పని చేసింది మరి.

అనన్య పాండే తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో భాగంగా ఈ వీడియోను షేర్ చేసింది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ తన సినిమా సెట్స్ నుండి వ్యక్తిగత జీవితం నుండి తరచుగా కథలను పంచుకుంటోంది. అనన్యకు సోషల్ మీడియాలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

కెరీర్ మ్యాటర్ కి వస్తే.. గెహ్రైయాన్ విజయం తర్వాత ఖో గయే హమ్ కహాన్ చిత్రీకరణతో బిజీ అయ్యింది. ఈ సినిమా నుండి తన సహనటుడు సిద్ధాంత్ చతుర్వేదితో మళ్లీ కలిసి పని చేయనుంది. ఈ చిత్రంలో ఆదర్శ్ గౌరవ్ కూడా నటించనున్నారు. అంతేకాకుండా అర్జున్ రెడ్డి ఫేమ్ సౌత్ స్టార్ విజయ్ దేవరకొండ బాలీవుడ్ అరంగేట్ర చిత్రం.. పాన్-ఇండియా బహుభాషా చిత్రం లైగర్ విడుదల కోసం ఆమె అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.