ఫొటోటాక్ : ఆ నడుము.. నాభి ఏంట్రా బాబు

Fri Jan 28 2022 08:00:02 GMT+0530 (IST)

Ananya Nagella Latest Photo

మల్లేశం సినిమాతో నటిగా పరిచయం అయిన అనన్య నాగళ్ల ఆ తర్వాత ప్లే బ్యాక్ సినిమా తో మరింత గుర్తింపు దక్కించుకుంది. ప్లే బ్యాక్ సినిమాలో అనన్య నాగళ్ల క్యూట్ గా కనిపించి మెప్పించింది. ఆ సినిమా తో వచ్చిన గుర్తింపు తో అనన్య ఏకంగా పవన్ కళ్యాణ్ 'వకీల్ సాబ్' సినిమాలో అవకాశం దక్కించుకుంది. వకీల్ సాబ్ సినిమా తో వచ్చిన స్టార్ డమ్ ఈమెకు మరిన్ని ఆఫర్లు తెచ్చి పెట్టింది. ఈమె హీరోయిన్ గా వరుసగా సినిమా ఆఫర్లు కూడా వస్తున్నాయట. ఇతర భాషల్లో కూడా ఈమెకు ఛాన్స్ లు వస్తున్నాయట. ఇదే సమయంలో ఈ అమ్మడు సోషల్ మీడియాలో అందాల ప్రదర్శణతో ఆకట్టుకుంటుంది.అనన్య నాగళ్ల క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో పాటు ట్రెడీషనల్ లుక్ లో కూడా ఈ అమ్మడు ఆకట్టుకుంది. తాజాగా ఈ అమ్మడు తన నడుము అందాలను ఎక్స్ పోజ్ చేస్తూ ఇచ్చిన ఫొటో షూట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెట్టింట వైరల్ అవుతున్న ఈ ఫొటోలకు తెగ కామెంట్స్ కూడా వస్తున్నాయి. కొందరు ఈ అమ్మడి ఫొటోలను ట్రోల్ చేస్తుంటే మరి కొందరు మాత్రం ఈమెను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ముద్దుగుమ్మ అనన్య నాగళ్ల మరీ ఇంతలా నడుము అందాలను చూపడం తో పాటు నాభి అందాలను ఎక్స్ పోజ్ చేస్తూ ఇచ్చిన ఫొటో ఫోజ్ లకు పలువురు పలు రకాలుగా స్పందిస్తున్నారు.

ప్రస్తుతం అనన్య నాగళ్ల పలు తెలుగు సినిమా ల్లో నటిస్తుంది. సమంత నటించిన శాకుంతలం సినిమా లో ఈమె కీలక పాత్రలో కనిపించబోతుంది. అది మాత్రమే కాకుండా పలు సినిమాల్లో కూడా ఈమె కీ రోల్స్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఒక స్టార్ హీరో సినిమా లో కూడా ఈమె కీలక పాత్రలో కనిపించబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆ విషయమై మరింత స్పష్టత రావాల్సి ఉంది. మొత్తానికి రెగ్యులర్ కమర్షియల్ హీరోయిన్ గా పేరు దక్కించుకునేందుకు అనన్య నాగళ్ల చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నట్లుగానే ఉన్నాయి.