ట్రోలర్ లకు అడ్డంగా బుక్కైన హీరో రాజా

Thu May 12 2022 20:00:01 GMT+0530 (IST)

Anand Hero Latest Video Goes Viral On Social Media

సోషల్ మీడియా వచ్చిన తరువాత ఏది చేసినా.. ఏది మాట్లాడినా .. అందులో తప్పు దొకర్లిందంటే చాలు సెలబ్రిటీ స్టార్ హీరో మినిస్టర్ అని నెటిజన్స్ చూడటం లేదు. నెట్టింట అడ్డంగా బుక్ చేస్తున్నారు. కామెంట్ ల వర్షం కురిపిస్తూ పిచ్చెక్కిస్తున్నారు. దీంతో న్రతీ ఒక్కరు మీడియా ముందు కానీ సోషల్ మీడియా వేదికగా కానీ ఆచితూచి స్పందిస్తున్నారు. అయితే మాజీ హీరో రాజా ఇవన్నేవి పట్టించుకోకుండా కామెంట్ లు చేసి తాజాగా అడ్డంగా బుక్కయ్యాడు.సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించిన `ఆనంద్` మంచి కాఫీ లాంటి సినిమా తో హీరోగా మంచి గుర్తంపుని సొంతం చేసుకున్నారు రాజా. ఆ నలుగురు ఒక ఊరిలో.. వెన్నెల బంగారం అర్జున్ స్టైల్ మిస్టర్ మేధావి సొంత ఊరు వంటి చిత్రాలతో పాపులర్ అయ్యారు. అయితే 2016  నుంచి సినిమాకు దూరంగా వుంటూ వస్తున్నారు. తన వ్యక్తగత కారణాల వల్ల పాస్టర్ గా మారిన రాజా ఆ తరువాత క్రిస్టియన్ మత ప్రచారకుడిగా సరికొత్త అవతారం ఎత్తారు.

సినిమాలకు దూరంగా వుంటూ మత ప్రచారం చేసుకుంటున్న రాజా తనని లైమ్ లైట్ లోకి తీసుకొచ్చిన సినిమాలపై తాజాగా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం పలువురిని ఆగ్రహానికి గురిచేస్తోంది. దీంతో రాజాని నెటిజన్ లు ఓ రేంజ్ లో ఆడేసుకుంటున్నారు. తాజాగా రాజా సినిమాపై వివాదాస్పదంగా స్పందించిన ఓ వీడియో బయటకు వచ్చింది. దీన్ని ఆధారంగా చేసుకున్న నెటిజన్స్ రాజాని అడ్డంగా బుక్ చేస్తూ నెట్టింట ట్రోల్ చేస్తున్నారు.

శుక్రవారం వచ్చిందంటే చాలు ఫస్ట్ డే ఫస్ట్ షో చూడటానికి ఎగబడిపోతుంటారు ఎందుకు ఆ పనికిమాలిన సినిమాలు చూడటం వల్ల మీకేమొస్తుంది. గంట సేపు లైన్లో నలబడి టికెట్ల కోసం కొట్టుకుని మూడు గంటల సేపు సినిమా చూసే బదులు ఆ నాలుగు గంటలు మీ తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు బంధువుల కోసం ప్రార్ధించండి. ఇంత చెడుతనం మన పక్కన వున్నా మనం చెలనం లేకుండా వుండటం ఎందుకు? ఆ సినిమాలు చూసే బదులు ప్రభువుని ప్రార్థించండి. ఇప్పడు సినిమాలని తిరిగితే చివరి రోజు దేవుడే మనకు సినిమా చూపిస్తాడు` అంటూ సినిమాపై తన అక్కసునంతా వెల్లగక్కాడు రాజా. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.

ఈ వీడియో నెట్టింట్లో వైరల్ కావడంతో నెటిజన్స్ రాజాపై విరుచుకుపడుతున్నారు. ఒకప్పుడు అన్నం పెట్టిన సినిమానే ఇప్పడు విమర్శస్తున్నావా? . ఈ యాక్టింగ్ ఏదో అప్పుడే సినిమాల్లో చేసుంటే మంచి స్టార్ అయ్యేవాడివి. ఇప్పడు ఇన్ని అంటున్నావ్ మరి అప్పట్లో నువ్వేం చేశావన్నా? . అంటూ రాజా చేసిన సినిమాల లిస్ట్ షేర్ చేస్తూ ఓ ఆట ఆడుకుంటున్నారు.