Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: ఖాళీగా ఇంట్లోనే ఉంటే ఆమె ఇంతే

By:  Tupaki Desk   |   9 July 2020 4:15 AM GMT
ఫోటో స్టోరి: ఖాళీగా ఇంట్లోనే ఉంటే ఆమె ఇంతే
X
అందం, ప్ర‌తిభ ఉన్నా అదృష్టం క‌లిసి రావాలి. ల‌క్ చిక్క‌క‌పోతే అందం అడ‌వికాచిన వెన్నెలే. ఉత్త‌రాది బ్యూటీ అమైరా ద‌స్తూర్ ని చూస్తే ఆ మాత్రం అవ‌గాహ‌న త‌ప్ప‌క క‌లుగుతుంది. అందానికి అందం ప్ర‌తిభ ఉన్నా కానీ ఈ అమ్మ‌డు ఎందుక‌నో ఆశించిన రేంజుకు ఎద‌గ‌లేక‌పోయింది. టాలీవుడ్ తెర‌పై ఇలా క‌నిపించి అలా మాయ‌మైపోయిన వాళ్లు ఉన్నారు. మాజీ విశ్వ‌సుంద‌రి ఐశ్వ‌ర్యారాయ్ ని త‌ల‌పించిన స్నేహా ఉల్లాల్, మున్ మున్ సేన్ వార‌సురాళ్లు రియా సేన్- రైమా సేన్ వీళ్ల కేట‌గిరీలోనే ఈ అమ్మ‌డు కూడా కెరీర్ కోసం జీవితాంతం పాకులాడాల్సి వ‌స్తోంది.

న‌టించిన తొలి సినిమాతోనే కుర్ర‌కారులో అమైరా అందం రిజిస్టర్ అయినా ఏం లాభం. మంజుల ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన `మ‌న‌సుకు న‌చ్చింది` చిత్రంతో తెలుగు తెర‌కు ప‌రిచ‌యం అయ్యింది. ఆ చిత్రంలో సందీప్ కిష‌న్ క‌థానాయ‌కుడిగా న‌టించాడు. కానీ తొలి ప్ర‌య‌త్నం బాక్సాఫీస్ వ‌ద్ద ఆశించిన ఫ‌లితం ద‌క్క‌లేదు. పైగా ఆ సినిమాలో ప‌క్కింట‌మ్మాయి త‌ర‌హా పాత్ర‌లో న‌టించ‌డం అమైరాకు మైన‌స్ అయ్యింది. ఆ త‌ర్వాత‌ టాలీవుడ్ వ‌దిలి ఇరుగు పొరుగు భాష‌ల్లో ప్ర‌య‌త్నించింది.

ఇక సోష‌ల్ మీడియాల్లో అమైరా లేటెస్ట్ ఫోటోషూట్ల‌తో హాట్ టాపిక్ గా నిలుస్తోంది. అమైరా తాజా ఫోటో వైర‌ల్ గా మారింది. ఈ కొత్త ఫోటోషూట్ లో మునుప‌టి కంటే సింపుల్ గా క‌నిపించింది. అంద‌మైన న‌వ్వుతో కుర్ర‌కారు హార్ట్ ని ట‌చ్ చేస్తోంది. క్వారంటైన్ టైమ్ లో ఖాళీగా ఉంటే ఇదిగో ఇలా పుస్త‌కాలు చ‌దివే అవ‌కాశం దొరుకుతుంది. బ‌హుశా అమైరా పుస్త‌కాల పురుగు అయ్యుంటుందేమో. ప్ర‌స్తుతం ఈ ఫోటో సామాజిక మాధ్య‌మాల్లో జోరుగా వైర‌ల్ అవుతోంది.

ప్ర‌స్తుత కెరీర్ ని ప‌రిశీలిస్తే.. 2019లో ఈ అమ్మ‌డు ఓ రెండు హిందీ చిత్రాల్లో.. ఓ త‌మిళ చిత్రంలో న‌టించింది. త‌మిళంలో `ఊడి ఊడి ఉజైకానుమ్` అనే చిత్రంలో న‌టించింది. అలాగే బాలీవుడ్ లో మెంట‌ల్ హై క్యా.. మేడ్ ఇన్ చైనా చిత్రాల్లో ఆడిపాడింది. ప్ర‌స్తుతం తెలుగు మూవీ రాజుగాడు హిందీ రీమేక్ సెట్స్ పై ఉంది. కాధ‌లై తేడి నిత్య అనే త‌మిళ చిత్రం సెట్స్ పై ఉంది. కానీ ఇవేవీ మ‌హ‌మ్మారీ క్రైసిస్ వ‌ల్ల‌ ఇంకా రిలీజ్ కి రాలేదు. దీంతో అమ్మ‌డు డీలా ప‌డిపోయింది.