Begin typing your search above and press return to search.

అలా.. లేత అందాలతో హీటేక్కిస్తున్న సెల్ఫీ భామ!!

By:  Tupaki Desk   |   6 Aug 2020 4:30 PM GMT
అలా.. లేత అందాలతో హీటేక్కిస్తున్న సెల్ఫీ భామ!!
X
అమైరా ద‌స్తూర్.. తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం తక్కువే అని చెప్పాలి. ఎందుకంటే ఈ భామ తెలుగులో ఒకే ఒక సినిమా చేసింది. 2018లో సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కిన 'మ‌న‌సుకు న‌చ్చింది' సినిమాతో తెలుగుతెరపై అడుగు పెట్టింది. అదే తన ఫస్ట్ అండ్ లాస్ట్ తెలుగు సినిమా. అయితే ముంబైలో పుట్టిపెరిగిన అమ్మడు హిందీ.. తమిళ సినిమాలు ఎక్కువగా చేసింది. అందం అభినయం ఉన్నా కానీ అమైరా తెలుగు ప్రేక్షకులను మాత్రం ఆకట్టుకోలేక పోయింది. అందుకే అమ్మడికి తెలుగులో అవకాశాలు కరువయ్యాయి. 16యేళ్ళ వయసులోనే మోడలింగ్ లోకి ప్రవేశించి డవ్, వోడాఫోన్, మైక్రోమాక్స్ వంటి బ్రాండులకు మోడలింగ్ చేసింది.

ఇక 2013లో ఇషాక్ సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి.. 2015లో ధనుష్ సరసన అనేగన్ సినిమాలో నటించి తమిళ ఇండస్ట్రీలోకి అరంగేట్రం చేసింది. కానీ అమ్మడికి ఏ ఇండస్ట్రీలో కూడా అదృష్టం కలిసి రాలేదు. నిజానికి తెలుగులోనే సెటిల్ అయిపోవాల‌ని అనుకుందట అమ్మడు. చివరికి అవకాశాలు లేక కనీసం అందాల ఆర‌బోత‌ అయినా చేద్దామని ఫిక్స్ అయిందట. అమైరా అందాల విందు బాగానే చేస్తుంది. అనేకుడు సినిమాలో అమ్మడిని చూస్తే ఎంతటివారైనా ఫిదా అయిపోతారు. బాలీవుడ్ లో ఇమ్రాన్ హష్మీ సరసన "మిస్టర్ ఎక్స్" అనే సినిమా చేసింది. ఆ సినిమాలో రొమాన్స్ తో పాటు ఏకంగా బికిని కూడా ధరించి హీటెక్కించింది.

ప్రస్తుతం యంగ్ హీరోలతో స‌ర్దుకుపోవడానికి సిద్ధమైందట. ఇక వెబ్ సిరీస్ లతో పాటు చిన్న సినిమాలు చేసుకుంటుంది అమైరా. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫోటోషూట్లతో హల్చల్ చేస్తోంది. తాజాగా ఈ భామ వర్కౌట్ చేస్తున్న ఫోటో షేర్ చేసింది. ఆ ఫోటోలో అమైరా చేతిలో డంబెల్స్ పట్టుకొని సెల్ఫీ తీసుకుంది. ఆ ఫోటోలో అమ్మడి అందాలు చూస్తే ఎంతటి మగవారైనా చూపు తిప్పుకోరంతే. జిమ్ డ్రెస్ లో అమైరా శరీరాకృతి హీటెక్కించేలా ఉంది. అందమైన మేనిఛాయలో అలా ఎద అందాలను కొసరుతుంది. ఆహా.. అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పిక్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.