ఎమీ 2.0 రీలోడెడ్.. టెరా బైట్ స్పీడ్ తో!!

Tue Jul 14 2020 21:30:50 GMT+0530 (IST)

Amy 2.0 Reloaded .. with Terabyte Speed ??!!

బ్రిటీష్ బ్యూటీ ఏమీ జాక్సన్ ఇంతకీ ఏమైంది? ఇన్నాళ్లు ఐపు లేకుండా పోయింది? కొన్నేళ్లుగా లండన్ బిజినెస్ మ్యాగ్నెట్ జార్జిపనాయట్టుతో ఘాటైన ప్రేమాయణం సాగిస్తోంది. అతడితో సహజీవనంలో ఓ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. గర్భధారణ సహా ప్రసవానంతరం జాగ్రత్తలపై లైవ్ చాట్ చేసి అభిమానుల్ని యంగేజ్ చేసింది. ఇటీవల పుత్రరత్నం ఆండ్రియాస్ పానయటౌ ముద్దు మురిపాలతోనే కాలక్షేపం చేస్తోంది. భర్త కొడుకుతో దేశ విదేశాలకు షికార్లు వెళుతూ ఆనందాన్ని అభిమానులతో ఫోటోల రూపంలో షేర్ చేసుకుంటోంది.ఇక అన్నిటికీ చెక్ పెట్టి సినీవినీలాకాశంలోకి రీఎంట్రీ ఇవ్వాల్సిన టైమ్ వచ్చిందా? అంటే.. అవుననే అర్థమవుతోంది. ఎమీజాక్సన్ ఇప్పటికే తన రూపురేఖల్ని మార్చేసుకుంది. అసలు ఒక బిడ్డకు తల్లి అంటే ఎవరూ నమ్మలేరేమో! అంతగా షేపప్ అయ్యింది. నిజానికి ఎమీ అందరిలాంటి మమ్మీ కానేకాదు. ప్రసవం సమయానికి అదుపుతప్పి భారీగా బరువు పెరగలేదు. ముందు నుంచి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంది.

ఓవైపు బిడ్డకు జన్మనివ్వడానికి టైమ్ వచ్చినా ఎనిమిదో నెలలోనూ డంబెల్స్ పట్టుకుని ఎక్సర్ సైజులు చేసి ఆశ్చర్యపరిచింది. యోగా సహా జిమ్ ని ఏనాడూ విడిచిపెట్టలేదు. అందుకేనేమో.. ఇప్పటికీ పర్ఫెక్ట్ ఫిగర్ ని మెయింటెయిన్ చేయగలుగుతోంది. ఎమీజాక్సన్ 2.0 రీలోడెడ్ అన్నట్టుగానే ఉంది ఈ లేటెస్ట్ ఫోటో చూస్తుంటే. ఒంపుసొంపుల వయ్యారాల్ని టోన్డ్ బాడీని పర్ఫెక్ట్ ఫిట్ గా రెడీ చేసేసింది. నేరుగా బాలీవుడ్ సహా సౌత్ ఇండస్ట్రీస్ లోకి మరోసారి టెరా గిగాబైట్ స్పీడ్ తో దూసుకు రావాలనే ప్లాన్ ఉన్నట్టుంది. రజనీ తో 2.0 రిలీజ్ తర్వాత ఎమీ కొన్ని సినిమాల్లో నటించింది. వాటన్నిటినీ ఇకపై పూర్తి చేస్తుందేమో!