అమ్మడు సూటేసినా.. కుర్రాళ్ళు హీటెక్కాల్సిందే!!

Thu Aug 13 2020 16:00:01 GMT+0530 (IST)

Amrya Dastur Trendy Photoshoot

అమైరా దస్తూర్.. ఈ మధ్యే తెలుగు పరిశ్రమకు పరిచయం అయింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ భామ పేరు తెగ వైరల్ అవుతోంది. సినిమాల పరంగా కాదులెండి.. గ్లామరస్ ఫోటోషూట్స్ వలన వైరల్ అవుతోంది. సందీప్ కిషన్ సరసన మనసుకు నచ్చింది అనే సినిమా చేసింది అమైరా.  తెలుగులో ఈ భామ మొదటి సినిమా అది.. అలాగే లాస్ట్ సినిమా కూడా అదే. ఎందుకంటే ఆ సినిమా ప్లాప్ అవ్వడంతో మళ్లీ తెలుగు సినిమాలలో కనిపించలేదు. కానీ అమైరా అందం మాత్రం సినీ ప్రేక్షకులకు బాగానే నచ్చిందట. ఫస్ట్ సినిమా పోయినా తెలుగులోనే సెటిల్ అయిపోవాలని చూస్తుందట. అందుకే అందాల ఆరబోతనే ఎక్కువగా నమ్ముకుంటుంది ఈ ముద్దుగుమ్మ. అమైరా అందాల బాణం వేయడంలో చాలా మేటి అనిపించుకుంటుంది. తాజాగా సోషల్ మీడియాలో ఓ పిక్ పోస్ట్ చేసింది అమ్మడు. కొంటెగా తినేసేలా చూస్తుంది కదా..! ఈ భామను చూస్తే ఎంతటివారైనా అలా ఫిదా అయిపోవాల్సిందే. గతంలో రాంచరణ్ ధృవ సినిమాలో హీరోయిన్ గా అమైరాకు అవకాశం అందినట్టే అంది చేజారిందట.ఆ తర్వాత చాలా సినిమాలు అనుకున్నా అమ్మడికి అదృష్టం కలిసి రాలేదు. ఇక లాభం లేదని యంగ్ హీరోలతో.. వచ్చిన అవకాశాలతో నెట్టుకుపోతుంది. తెలుగులోకి నేరుగా సినిమా చేయడానికి లేట్ అయినా తమిళ డబ్బింగ్ సినిమాతో మాత్రం తెలుగు ప్రేక్షకులకు ముందే పరిచయం అయిందని చెప్పాలి. హీరో ధనుష్ సరసన నటించిన అనేగన్ మంచి విజయమే సాధించింది. కానీ అవకాశాలు సరిగ్గా రాలేదట. అయినా అమైరాను ఎందుకో మన దర్శకులు హీరోలు పట్టించుకోవడం లేదు. పైగా బాలీవుడ్ ఇండస్ట్రీలో సీరియల్ కిస్సర్ ఇమ్రాన్ హష్మీతో మిస్టర్ ఎక్స్ సినిమా చేసింది. అక్కడ కూడా ఫ్లాపవడంతో.. ఏం చేయాలో తోచక చిన్న సినిమాలు చేసుకుంటుంది అమైరా. ప్రస్తుతం ఇదిగో ఇలా వేడెక్కించే ఫోటోషూట్స్ తో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఇక నెట్టింట్లో అమ్మడికి లక్షల్లో ఫ్యాన్స్ ఉన్నారు. తాజాగా పోస్ట్ చేసిన ఫొటోలో అమైరా దోర అందాలు కుర్రకారును ఊరిస్తున్నాయట. మంచి సూట్ అయితే ధరించి ప్యాంటు వేయకుండా హీటెక్కిస్తోంది. అందాల బాణం అంతంత మాత్రంగా విడిచినా పిక్ మాత్రం సింప్లీ సూపర్ అంటున్నారు అభిమానులు. అందుకే ఫోటో తెగ వైరల్ అవుతోంది.