బాలీవుడ్ ప్రముఖుల్ని షేక్ చేస్తున్న ఈమొయిల్?

Wed Jul 17 2019 12:42:41 GMT+0530 (IST)

ఒకరి తర్వాత మరొకరు చొప్పున హ్యాకింగ్ షాకు కు గురవుతున్న వైనం ఇప్పుడు బాలీవుడ్ లో ఎక్కువగా కనిపిస్తోంది. బాలీవుడ్ మెగాస్టార్ బిగ్ బీ మొదలుకొని పలువురు బాలీవుడ్ ప్రముఖుల సోషల్ మీడియా ఖాతాలు హ్యాక్ అవుతున్న వైనం ఇప్పుడు పెద్ద ఇబ్బందిగా మారింది. తాజాగా నటి అమృతారావు ట్విట్టర్ ఖాతా హ్యాకింగ్ కు గురైంది.ఇంతకీ.. వీరి సోషల్ మీడియా ఖాతాలు ఎలా హ్యాక్ అవుతున్నాయి?  అన్న క్వశ్చన్ కు ఆరా తీస్తే ఆసక్తికర అంశాలు బయటకు వచ్చాయి. తాజాగా ట్విట్టర్ ఖాతా హ్యాక్ అయిన అమృతరావు సంగతే చూస్తే.. ఇటీవల ఆమెకు ఒక ప్రముఖ మీడియా సంస్థ నుంచి ఒక లేఖ వచ్చిందట.

అందులో ఆమె ఇంటర్వ్యూ కావాలని కోరారట. ఆ మొయిల్ కు రిప్లై ఇచ్చేందుకు ఒక లింక్ ఇచ్చారని.. దాన్ని క్లిక్ చేసినంతనే తన సోషల్ మీడియా ఖాతా హ్యాక్ అయినట్లుగా ఆమె వెల్లడించారు. తనకొచ్చిన మొయిల్ ను తన సోషల్ మీడియా అకౌంట్ ను డీల్ చేసే బృందంలోని వారు క్లిక్ చేశారని.. దాంతో తన ట్విట్టర్ ఖాతా హ్యాకైనట్లుగా ఆమె పేర్కొన్నారు.

అమృతరావు అనుభవాన్ని వెల్లడించిన వెంటనే..తమకు కూడా అలాంటి అనుభవమే ఎదురైనట్లుగా గుర్తు చేసుకోవటం గమనార్హం. గతంలోనూ తన ట్విట్టర్ ఖాతాకు ఇలాంటి అనుభవమే ఎదురైనట్లుగా అమితాబ్ వెల్లడించారు. ఇదే తరహాలో ఇంటర్వ్యూ వల విసిరి వారి సోషల్ మీడియా ఖాతాల్ని హ్యాకింగ్ కు గురైన చేదు అనుభవం షాహిద్ కపూర్.. అద్నాన్ సమీలు కూడా ఉన్నారు. ఏమైనా బాలీవుడ్ ప్రముఖులకు ఇప్పుడీ హ్యాకింగ్ వ్యవహారం పెద్ద తలనొప్పిగా మారిందంటున్నారు.