Begin typing your search above and press return to search.

నువ్వే నాకు సర్కార్: ఆర్జీవీ పై బిగ్ బి ట్వీట్

By:  Tupaki Desk   |   27 May 2020 3:30 PM GMT
నువ్వే నాకు సర్కార్: ఆర్జీవీ పై బిగ్ బి ట్వీట్
X
టాలీవుడ్ లో వివాదాలకు.. వివాదాస్పద ట్వీట్లకు పెట్టింది పేరు సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ. రోజు ఏదొక వివాదంతో సోషల్ మీడియాలో వివాదాలను సృష్టిస్తూనే ఉంటారు. అలాంటి ఆర్జీవీ పై ఇండియన్ సూపర్ స్టార్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ప్రశంసల వర్షం కురిపించారు. ‘కరోనా వైరస్’ టైటిల్ పేరిట లాక్ డౌన్ సమయంలో ఓ సినిమాను షూట్ చేశారు వర్మ. ఇటీవలే ఆ కరోనా వైరస్ మూవీ ట్రైలర్ ను విడుదల చేసాడు. ఆ ట్రైలర్ చూసిన బిగ్ బీ రాంగోపాల్ వర్మను ఓ రేంజ్ లో పొగిడారు. అమితాబ్ స్పందిస్తూ.. ‘మిమ్మల్ని ఎవరూ అణచలేరు రామ్ గోపాల్ వర్మ ! పలువురికి మీరు ‘రామూ’ అయితే నాకు ‘సర్కార్’. లాక్ డౌన్ సమయంలో ఒక కుటుంబంపై సినిమా షూట్ చేయడం అపూర్వం. బహుశా కరోనా వైరస్ పై ఇదే మొదటి సినిమా అనుకుంటా ‘ అని ట్వీట్ చేశారు. ఈ సినిమా ట్రైలర్ ని కూడా ఆయన తన ట్వీట్ తో జత చేశారు.

మంగళవారం విడుదల చేసిన నాలుగు నిముషాల నిడివి గల సినిమా ట్రైలర్ ప్రస్తుతం యూట్యూబ్ లో మిలియన్ల వ్యూస్ తో పరుగులు తీస్తోంది. ఈ కరోనా వలన లాక్ డౌన్ సమయంలో ప్రజలలో నెలకొన్న భయాలను ఈ సినిమా ప్రతిబింబించిందని, అంతే తప్ప ఇది హారర్ సినిమా కాదని వర్మ ట్వీట్ చేశాడు. ప్రభుత్వం విధించిన నిబంధనలను పాటిస్తూ అన్ని ప్రికాషన్స్ తీసుకుంటూ ఈ మూవీ షూట్ చేసినట్టు ఆయన పేర్కొన్నాడు. ఈ కరోనా వైరస్ సినిమా రూపొందించడానికి లాక్‌డౌన్‌ సమయంలో కథ తయారు చేశాం. లాక్‌డౌన్‌ సమయంలోనే చిత్రీకరించాం. ఎందుకంటే మా పనిని దేవుడైనా కరోనా అయినా ఏదీ ఆపలేదు. కరోనా మనందరిలోనూ ఉన్న భయం. ఆ భయం, వ్యాధి, చావును జయించడానికి ప్రేమకున్న శక్తిని నిరూపించే పరీక్ష ఇది’’ అని ట్వీట్ చేశారు. ప్రస్తుతం వర్మ చేస్తున్న ట్వీట్లు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.