గౌరవం పోయినా.. బతికించారు.. గౌరవిస్తాను: అమితాబ్

Tue Aug 04 2020 23:00:01 GMT+0530 (IST)

Even if there is no respect .. I have survived .. I will respect: Amitabh

కరోనాను జయించిన బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ తనకు చికిత్సను అందించిన ముంబైలోని నానావతి ఆస్పత్రిపై తాజాగా సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపించారు. వారికి కృతజ్ఞతలు తెలిపారు.అయితే అమితాబ్ చేసిన ట్వీట్ ను ఓ మహిళ తప్పుపట్టింది. ఇదే నానావతి ఆస్పత్రి తన తండ్రికి కరోనా లేకపోయినా ఉన్నట్టు చికిత్స చేసిందని.. డబ్బు గుంజిందని.. అలాంటి ఆస్పత్రికి అమితాబ్ పబ్లిసిటీ చేస్తున్నారని.. దీనిపై బిగ్ బిపై ఇన్నాళ్ల గౌరవం పోయిందని కౌంటర్ ఇచ్చింది.

దీనికి బిగ్ బి కూడా సమాధానమిచ్చాడు. తాను అస్పత్రి కోసం పబ్లిసిటీ చేయడం లేదని.. నన్ను సంరక్షించినందుకు.. చికిత్స అందించినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. మీరు నాపై గౌరవం కోల్పోయినా నేను మాత్రం ఆస్పత్రిని వైద్యులను గౌరవిస్తానని కుండబద్దలు కొట్టారు.