Begin typing your search above and press return to search.

ఫొటోటాక్‌ : ముగ్గురు సూపర్‌ స్టార్‌ ల కొడుకులతో మెగాస్టార్‌

By:  Tupaki Desk   |   24 Jan 2020 3:39 PM GMT
ఫొటోటాక్‌ : ముగ్గురు సూపర్‌ స్టార్‌ ల కొడుకులతో మెగాస్టార్‌
X
సోషల్‌ మీడియాలో ప్రస్తుతం కత్రీనా కైఫ్‌ పెళ్లి.. ఆ పెళ్లిలో అమితాబచ్చన్‌ జయాబచ్చన్‌ లు డాన్స్‌ చేయడం.. అదే పెళ్లిలో తెలుగు స్టార్‌ హీరో నాగార్జున తమిళ స్టార్‌ ప్రభు కన్నడ స్టార్‌ శివరాజ్‌ కుమార్‌ లు సందడి చేసిన ఫొటోలు వైరల్‌ అవుతున్నాయి. కత్రీనా పెళ్లి కూతురుగా ఉన్న ఫొటోలు ఓ రేంజ్‌ లో వైరల్‌ అవుతున్నాయి. కొందరు నిజంగానే కత్రీనా పెళ్లా అనుకుంటున్నారు. ఇంతగా వైరల్‌ అవుతున్న ఈ ఫొటోలు అన్ని కూడా కళ్యాణ్‌ జ్యూవెలర్స్‌ యాడ్‌ మేకింగ్‌ కు సంబంధించిన స్టిల్స్‌.

కళ్యాణ్‌ జ్యువెలర్స్‌ కు బ్రాండ్‌ అంబాసిడర్స్‌ గా వీరంతా కూడా వ్యవహరిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలకు నాగార్జున.. తమిళనాట ప్రభు.. కర్ణాటకలో శివరాజ్‌ కుమార్‌ ఉత్తర భారతం మొత్తం అమితాబ్‌ దంపతులు బ్రాండ్‌ అంబాసిడర్స్‌ గా వ్యవహరిస్తున్నారు. అందుకే అప్పుడప్పుడు వీరంతా కలిసి ఇలా ముఖ్యమైన యాడ్స్‌ లో నటిస్తూ ఉంటారు. తాజాగా కత్రీనా పెళ్లి కి సంబంధించిన యాడ్‌ చిత్రీకరణ చేశారు. దాంట్లో వీరంతా కలిసి నటించారు.

అన్ని ఫొటోల్లోకి అమితాబచ్చన్‌ పోస్ట్‌ చేసిన ఈ ఫొటో బాగా వైరల్‌ అవుతుంది. ఈ ఫొటోను షేర్‌ చేసిన అమితాబ్‌ ట్విట్టర్‌ లో... ఇది నాకు జయకు చాలా గౌరవ ప్రథమైన ఫొటో. దీంట్లో ముగ్గురు సూపర్‌ స్టార్‌ కొడుకులు ఉన్నారు. ఆ ముగ్గురు ఇండియన్‌ లెజెండ్స్‌ కొడుకులతో మేము కలిసి నటించడం చాలా గౌరవంగా భావిస్తున్నాం అంటూ పోస్ట్‌ చేశాడు. అక్కినేని నాగేశ్వరరావు తనయుడు నాగార్జున(తెలుగు).. రాజ్‌ కుమార్‌ తనయుడు శివరాజ్‌ కుమార్‌(కన్నడ).. శివాజీ గణేషన్‌ తనయుడు ప్రభు(తమిళం) అంటూ అమితాబ్‌ ట్వీట్‌ చేశాడు. ఈ ఫొటోకు నెటిజన్స్‌ ముగ్గురు సూపర్‌ స్టార్‌ ల కొడుకులతో మెగాస్టార్‌ అమితాబ్‌ అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.