మన మెట్రోలో అమితాబ్ బచ్చన్

Thu Jun 30 2022 14:52:17 GMT+0530 (India Standard Time)

Amitabh Bachchan in Hyderabad Metro

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఇటీవల కాలంలో తెలుగు చిత్రపరిశ్రమకు చాలా దగ్గరవుతున్నారు. అందులో భాగంగానే ఆయన ఎక్కువగా హైదరాబాదులోనే సంచరిస్తున్నారు. గతంలో సైరా సినిమా కోసం ఆయన హైదరాబాదులోనే కొన్ని రోజులపాటు ఉన్న విషయం తెలిసింది. ఇక మళ్ళీ ఆ తర్వాత ప్రభాస్ ప్రాజెక్ట్ కే సినిమా కోసం ఇక్కడికి రావాల్సి వచ్చింది.ఎంతో బిజీగా ఉండే అమితాబచ్చన్ ఒక సినిమాలో తన పాత్ర ఎంతో కీలకమై తేగానే సినిమా చేయడానికి ఒప్పుకోవడం లేదు. ఇక ప్రాజెక్టు కె విషయంలో మాత్రం ఆయన ఎంతో ఇష్టంగా సినిమాకు డేట్స్ ఇచ్చి నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ ప్రాజెక్ట్ కోసం ఆయన చాలా వేగంగానే వర్క్ చేస్తున్నట్లు కూడా అనిపిస్తోంది. ఎనిమిది పదుల వయసు దగ్గరపడినా కూడా ఆయన ఏమాత్రం వెనక్కి తగ్గకుండా చాలా ఎనర్జిటిక్ గా కనిపిస్తున్నారు.

పలు ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా అమితాబ్ బచ్చన్ కొనసాగుతున్న విధానం నేటి యువతరానికి కూడా ఎంతో స్ఫూర్తిగా నిలుస్తుంది అని చెప్పాలి. రీసెంట్ గా ఆయన హైదరాబాద్ మెట్రో పరిసరాల్లో కనిపించడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది.

అమితాబ్ బచ్చన్ కు సంబంధించిన కొన్ని సన్నివేశాలను మెట్రో రైల్వే స్టేషన్లో చిత్రీకరించినట్లుగా తెలుస్తోంది. ఇటీవల రాయదుర్గం మెట్రో స్టేషన్ లో అమితాబ్ బచ్చన్ కు సంబంధించిన కొన్ని ట్రైన్ సీక్వెన్స్ ను అతి కొద్ది మంది యూనిట్ సభ్యులతోనే షూట్ చేసినట్లుగా తెలుస్తోంది.

అయితే ఇది ఏ సినిమా షూట్ అనేది ఇంకా క్లారిటీ రాలేదు. కానీ అమితాబ్ బచ్చన్ కు సంబంధించిన ఫోటోలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ప్రస్తుతం అమితబ్ ప్రాజెక్టు కే లో ఒక ముఖ్యమైన బాధలో కనిపిస్తున్న విషయం తెలిసిందే.

ప్రభాస్ కు గురువుగా ఆయన ఒక ఫుల్ లెన్త్ పాత్రలోనే అలరించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక రీసెంట్ గా వైజయంతి మూవీస్ కొత్త ఆఫీస్ లాంచ్ కోసం కూడా ఆయన ప్రత్యేకకంగా వచ్చారు. అందుకు సంబంధించిన వీడియోలు ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.