బాలీవుడ్ మెగాస్టార్.. బిగ్ బి అమితాబచ్చన్ ఫ్యామిలీ నుండి ఆయన మనవరాలు నవ్య నవేలి హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతున్నారు అంటూ జాతీయ మీడియాలో చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. సోషల్ మీడియాలో ఆమె రెగ్యులర్ గా పోస్ట్ లు పెట్టడంతో పాటు సెలబ్రిటీ తరహాలో సందడి చేయడం జరుగుతుంది.
సినిమా కార్యక్రమాలకు అప్పుడప్పుడు హాజరు అవ్వడం.. ఇండస్ట్రీకి చెందిన ఆమె సన్నిహితుల యొక్క కార్యక్రమాలకు కూడా ఆమె హాజరు అవుతున్న కారణంగా ఇండస్ట్రీలో అడుగు పెట్టేందుకు ఆమె ఇలా సెలబ్రెటీ పార్టీలకు హాజరు అవుతున్నారు అనే వార్తలు జోరుగా సాగుతున్నాయి.
అమితాబ్ యొక్క మనవరాలు ఇండస్ట్రీలో అడుగు ఎప్పుడు పెడతారు.. ఏ సినిమా తో ఆమె ఇండస్ట్రీలో అడుగు పెడతారు అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న బిగ్ బి అభిమానులకు నవ్య నవేలి షాక్ ఇచ్చారు.
తాను హీరోయిన్ గా ఇండస్ట్రీలో అడుగు పెట్టాలని భావించడం లేదు. అసలు నాకు నటనపై ఆసక్తి లేదు అంటూ ఫుల్ క్లారిటీ ఇచ్చింది. ఇప్పటి వరకు నన్ను ఏ ఒక్కరు కూడా హీరోయిన్ పాత్రకు సంప్రదించలేదు అని కూడా ఆమె పేర్కొంది. ప్రస్తుతానికి తాను సినిమాల గురించి ఆలోచించడం లేదని పేర్కొంది.
ఆరా హెల్త్ ఆర్గనైజేషన్ పేరుతో స్వచ్చంద సంస్థను నిర్వహిస్తున్న నవ్య నవేలి ఎంతో మంది మహిళల యొక్క పరిశుభ్రత మరియు ఆరోగ్యం విషయంలో సహాయం చేస్తున్నారు. ఈ స్వచ్చంద సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశ్యం మహిళలను ఆరోగ్యం విషయంలో విద్యావంతులుగా మార్చడం అంటూ ఆమె పలు సందర్భాల్లో పేర్కొన్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.