Begin typing your search above and press return to search.

అమితాబ్ ఎంట్రీ షురూ..ప్రభాస్ తో జాయిన్ అయ్యేది అప్పుడే!

By:  Tupaki Desk   |   10 Oct 2020 1:30 PM GMT
అమితాబ్ ఎంట్రీ షురూ..ప్రభాస్ తో జాయిన్ అయ్యేది అప్పుడే!
X
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌ హీరోగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్‌ పతాకంపై ఓ భారీ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సి.అశ్వినీదత్‌ ఈ సినిమాను టాలీవుడ్ ఇండస్ట్రీలోనే భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఈ సినిమాలో ప్రభాస్‌కు జోడీగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకోనె నటిస్తున్నారు. ఈ సినిమాలో ఓ ముఖ్యమైన పాత్ర కోసం బిగ్ బీ అమితాబ్‌ బచ్చన్‌ ను నటింపజేసేందుకు మేకర్స్ సంప్రదించగా.. ఆయన ఓకే చెప్పిన సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమా కోసం అమితాబ్ డేట్స్ కూడా కేటాయించారని తాజా సమాచారం.

ప్రస్తుతం ప్రభాస్ రాధాకృష్ణ దర్శకత్వంలో 'రాధేశ్యామ్ ' అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాను డిసెంబర్ కల్లా పూర్తి చేయనున్నారు. జనవరి నుంచి నాగ్ అశ్విన్ సినిమా షూటింగ్ మొదలు కానుండగా ముందుగా హీరో ప్రభాస్, హీరోయిన్ దీపికాపై కొన్ని సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఏప్రిల్ నుంచి జరిగే షెడ్యూల్ లో 40 రోజుల పాటు అమితాబ్ డేట్స్ ఇచ్చారని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉండగా అమితాబ్ రాకతో అవి మరింత పెరిగాయి. సైన్స్‌ ఫిక్షన్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో సుమారు రూ. 500 కోట్లతో తెలుగు, తమిళం, హిందీ, ఇతర భాషల్లో నిర్మించనున్నారు. ఈ సినిమాపై అటు ట్రేడ్ లోనూ ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు ఉన్నాయి.