పుష్పరాజ్ చెప్పుపై బిగ్ బీ షోలో ప్రశ్న!

Sat Aug 13 2022 11:19:55 GMT+0530 (IST)

Amitabh Bachchan asked question about Pushpa In Kaun Banega Crore Pathi Show

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్  కథానాయకుడిగా నటించిన `పుష్ప ది రైజ్` సక్సెస్ గురించి చెప్పాల్సిన పనిలేదు.  దేశవ్యాప్తంగా పెను తుఫాను సృష్టించింది. హిందీ బెల్ట్ లో బన్నీ సునామీ వసూళ్లతో విరుచుకుపడిన చిత్రమది. ఒక్క హిట్ బన్నీ నార్త్ మార్కెట్ నే మార్చేసింది. ఈ స్థాయిలో సక్సెస్ అవుతుందని యూనిట్ సైతం అంచనా వేయలేకపోయింది.సినిమాలో ప్రతీ ప్రేమ్ ఎంతో హైలైట్ అయింది.  ప్రతీ పాత్ర ఆద్యంతం ఆకట్టుకున్నాయి. పుష్పరాజ్...శ్రీవల్లి పాత్రలు సినిమా స్థాయిని పెంచాయని చెప్పొచ్చు. బన్నీ మాస్ నటుడి నటనకు.. వ్యవహారశైలికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఇక శ్రీవల్లి పాట వరల్డ్ వైడ్ గా ఎంత ఫేమస్ అయిందో చెప్పాల్సిన పనిలేదు. ఈ పాటని రీక్రియేట్ చేయని క్రికెటర్ లేడు.

అంతర్జాతీయ క్రికెట్ దిగ్గజాలే శ్రీవల్లి పాటకు ఫిదా అయ్యారు. తమదైన రీక్రేషన్స్ తో అదరగొట్టి పాట స్థాయిని పెంచారు. ఇందులో స్టైలిష్ స్టార్  స్లిప్పర్ స్టెప్‌కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. తాజాగా ఆ స్టెప్ కి బిగ్ బీ అమితాబచ్చన్ సైతం ఫిదా అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం `కౌన్ బనేగా క్రోర్ పతి` సీజన్ 14ని హోస్ట్ చేస్తున్న అమితాబ్ బచ్చన్ కంటెస్టెంట్‌కి పుష్ప గురించి ఓ ఆసక్తికర  ప్రశ్న అడిగారు.  ఆ దశ వెనుక కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

స్లిప్పర్ స్టైలిష్ స్టెప్ చూసి అమితాబ్ ఇలా అన్నారు. `` హైదరాబాద్‌లో ఓ సినిమా షూటింగ్‌లో ఉండగా? ఇది నిజంగా కొరియోగ్రఫీ చేశారా? లేదా?  పొరపాటునా అని కంటెస్టెంట్  దర్శకుడిని అడిగారు. దానికి బధులుగా అతను `` అల్లు అర్జున్ స్లిప్పర్ మిస్ అయ్యాడని  అమితాబ్ తో`` అంటారు.

అప్పుడు అమితాబ్ స్లిప్పర్ తీసివేసి అల్లు అర్జున్ దానిని తిరిగి ధరించి  చాలా ప్రసిద్ధి చెందాడని  ఐకానిక్‌గా మారిన దశను   వివరించారు. అయితే ఆ దర్శకుడి పేరును మాత్రం అమితాబ్ వెల్లడించలేదు. దానికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది. ప్రఖ్యాత షో లో బన్నీ గురించి ప్రశ్న  రావడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

బన్నీ రేంజ్ ఉత్తరాదిన మరింత పెరుగుతుందని ఈ సన్నివేశంతో మరోసారి రుజువైంది. కౌన్ బనేగా షో దేశ వ్యాప్తంగా ఎంతో ఫేమస్ షో.  ఎంతో మంది నిరు పేదల్ని కరోడ్పతిల్ని  చేసిన ఏకైనా షో ఇది. ఇప్పుడిదే షో వివిధ భాషల్లోకి వచ్చేసింది. తెలుగులో  `ఎవరు మీలో కోటీశ్వరుడు`గా ప్రేక్షకుల్ని అలరిస్తోన్న సంగతి తెలిసిందే.