Begin typing your search above and press return to search.

నా ఫస్ట్ లవ్ తోనే మనసు విరిగిపోయింది: ఆమీర్ ఖాన్

By:  Tupaki Desk   |   30 Jun 2022 11:30 PM GMT
నా ఫస్ట్ లవ్ తోనే మనసు విరిగిపోయింది: ఆమీర్ ఖాన్
X
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమీర్ ఖాన్ నుంచి ఒక మంచి సినిమా వచ్చి చాలా కాలమైంది. అయితే ఆయన ఒక సినిమా చేసేందుకు ఎంత సమయం తీసుకున్నప్పటికీ కూడా కంటెంట్ కు తగ్గట్టుగా ప్రేక్షకులను మెప్పిస్తాడు అని ఒక బలమైన నమ్మకం అయితే ఇండస్ట్రీలో ఉంది.

ప్రస్తుతం అందరి ఫోకస్ కూడా ఫారెస్ట్ గంప్ ఆధారంగా తరికెక్కిన లాల్ సింగ్ చద్దా సినిమా పైనే ఉంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ట్రైలర్స్ అన్నీ కూడా ప్రేక్షకుల్లో అంచనాల స్థాయిని పెంచేశాయి.

ఆమీర్ ఖాన్ కూడా ఈ సినిమా రిజల్ట్ పై చాలా నమ్మకంతో ఉన్నట్లు అనిపిస్తుంది. ఎక్కడ ప్రమోషన్స్ లో పాల్గొన్న కూడా ఇది నా కెరీర్ లో ఎన్నటికీ మర్చిపోలేని సినిమా అవుతుంది అని తప్పకుండా ప్రతి సన్నివేశం కూడా ఆడియన్స్ కు కనెక్ట్ అవుతుంది అని తెలియజేశారు.

ఇక ఈ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచేందుకు కూడా చిత్ర యూనిట్ మరో అడుగు ముందుకు వేసింది. సినిమాలోని ఒక మెలోడీ సాంగ్ రిలీజ్ చేశారు.

'ఫిర్ నా ఐసి రాత్ ఆయేగీ' అనే ఆ సాంగ్ వర్గం వారిని ఎంతగానో ఆకట్టుకుంటోంది. అయితే ఈ పాటను విడుదల చేస్తూ ఆమీర్ ఖాన్ తన ఫస్ట్ లవ్ గురించి చెప్పుకొచ్చాడు. నేను సినిమాల్లోకి రాకముందు చదువుకునే క్రమంలో టెన్నిస్ ఆట పై ఎంతో మక్కువ పెంచుకున్నాను. ప్రత్యేకంగా క్లబ్ కు కూడా వెళ్లడం జరిగింది. అయితే అక్కడ రోజు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఒక అమ్మాయి నన్ను ఎంతగానో ఆకర్షించింది.

అదే నా మొదటి ప్రేమ. ఆ అమ్మాయిని చూసిన తరువాత చాలాసార్లు మాట్లాడాలని అనుకున్నాను. కానీ కుదరలేదు అయితే ఒకరోజు ఆ అమ్మాయి తన తల్లిదండ్రులతో కలిసి విదేశాలకు వెళ్ళిపోయింది అని తెలిసింది. అప్పుడు నా మనసు ముక్కలైపోయింది. విరిపొగిపోయింది. ఇక ఆ తర్వాత నేను టెన్నిస్ ఆటను కొనసాగించి స్టేట్ ప్లేయర్ గా నిలిచాను.. అంటూ ఆమీర్ ఖాన్ సరదాగా తెలియజేశాడు.