లేటు వయసులో ఘాటు సొగసుల గేటు తెరిచింది!

Tue May 26 2020 14:20:31 GMT+0530 (IST)

Ameesha Patel Stunning pose

అమీషా పటేల్.. ఈ పేరు వినగానే తెలుగు ప్రేక్షకులకు పవన్ కళ్యాణ్ నటించిన ‘బద్రి’ సినిమా గుర్తుకు వస్తుంది. మొదటగా ‘కహో నా ప్యార్ హై’ అనే బాలీవుడ్ సినిమాతో సినీ ఇండస్ట్రీలో తెరంగేట్రం చేసింది అమీషా. ఇక తెలుగులో ఫస్ట్ సినిమా పవన్ కళ్యాణ్ తో చేయడంతో ఈ భామ అందరికీ గుర్తుండిపోయింది. ఆ తరవాత తెలుగులో ‘నాని’ ‘నరసింహుడు’ - ‘పరమవీరచక్ర’ సినిమాల్లో నటించింది. చివరగా తెలుగులో 2017లో వచ్చిన ‘ఆకతాయి’ సినిమాలోని టైటిల్ సాంగ్ లో ఆడిపాడింది. ఈ అమ్మడు తెలుగులో చేసిన సినిమాలు తక్కువే అయినా తనకంటూ ప్రత్యేక గుర్తింపును ఏర్పరుచుకుంది. ఎల్లప్పుడూ సినిమాలతో బిజీగా ఉండే అమీషా ఈ మధ్య సోషల్ మీడియాలోనూ యాక్టివ్గా ఉంటుంది. ఎప్పటికప్పుడు కొత్త ఫొటోలను పోస్ట్ చేస్తూ అభిమానులను అలరిస్తుంది. నాలుగు పదుల వయసులోనూ వర్కౌట్స్ చేస్తూ మంచి ఫిజిక్ ను మెయింటైన్ చేస్తోంది ఈ గుమ్మ. నిజానికి అమీషాను చూస్తే ఇప్పటికి 20 నుంచి 25 ఏళ్ల వయసున్న అమ్మాయిలా ఫొటోస్ తో అభిమానుల హృదయాలను కొల్లగొట్టేస్తుంది.



ఇక రీసెంట్ గా అమీషా నటించిన భయ్యాజీ సినిమా సూపర్ హిట్ అవడంతో మళ్లీ ఆమె మళ్లీ ఆశలు చిగురించాయి. కాకపోతే ఈ సినిమా హిట్ తర్వాత మళ్లీ వరుస అవకాశాలు దానితో తనలోని అందచందాలను ఇంకా అలాగే ఉన్నాయని తెలిపేందుకు తన హాట్ హాట్ ఫోటో షూట్ లను ప్లాన్ చేసుకుంటోంది ఈ అందాల భామ. ఇప్పటికి అందానికి వయసుతో సంబంధం లేదని కొందరు సీనియర్ భామలు నిరూపిస్తున్నారు. వయసు పెరిగినకొద్దీ వన్నె తరగని అందం వారి సొంతం.. అలాంటి వారిలో అమీషా మొదటి వరుసలో ఉంటుంది. టాలీవుడ్ లో పలు సినిమాల్లో నటించిన ఈ అమ్మడు ఎక్కువ బాలీవుడ్ లోనే నటించి అక్కడే స్థిరపడి పోయింది. అమ్మడికి ప్రస్తుతం సినిమా ఆఫర్లు తగ్గడంతో సోషల్ మీడియాను హీటెక్కించే పనిలో పడింది. తాజాగా పోస్ట్ చేసిన ఫోటోలో అమ్మడి అందాల ప్రదర్శన మాములుగా లేదు. తన అందాలతో కుర్రకారు మతులు పోగొడుతుంది. ప్రస్తుతం ఈ భామ.. 'దేశి మ్యాజిక్' 'ది గ్రేట్ ఇండియన్ కాసినో''తోబా తేరా జల్వా' అనే సినిమాల్లో నటిస్తుంది అమీషా. లేటు వయసులో కూడా అమ్మడి ఘాటు ప్రదర్శన అభిమానులకు పిచ్చేక్కిస్తుంది.