ఫోటో స్టోరి: కాకలు పుట్టిస్తున్న అమీషా పటేల్

Thu Jun 24 2021 08:00:01 GMT+0530 (IST)

Ameesha Patel Latest Photo

సీనియర్ నటీమణి అమీషా పటేల్ కి ఇటీవల అవకాశాలు నిల్ అయిన సంగతి తెలిసిందే. సమకాలీన హీరోలు స్టార్ హీరోలుగా ఇంకా రాణిస్తున్నారు. తనతో పాటే కెరీర్ ప్రారంభించిన చాలా మంది ముద్దుగుమ్మలు సినీరంగంలో ఇంకా పెద్ద రేంజులోనే కొనసాగుతున్నారు.  కానీ ఎందుకనో అమీషా మాత్రం సైడ్ ట్రాక్ పట్టింది. తనకు ఇటీవల అస్సలు అవకాశాల్లేవ్.అయితే తనకు అవకాశాల్లేవు కదా! అని తాను మాత్రం అస్సలు నిరాశపడడం లేదు. సోషల్ మీడియాల్లో ప్రచారంలో యమ స్పీడ్ గా ఉండే ఈ బ్యూటీ అటు పంజాబీ చిత్రపరిశ్రమతోనూ సన్నిహితంగా మెలుగుతోంది. ఈ బ్యూటీ మరోవైపు వరుస ఫోటోషూట్లతోనూ హాట్ టాపిక్ గా మారుతోంది.

తాజాగా ఇన్ స్టాలో అమీషా షేర్ చేసిన ఓ బోల్డ్ ఫోటో అంతర్జాలాన్ని షేక్ చేస్తోంది. బ్లూ బికినీ ధరించి అలా చైర్ లో రిలాక్స్ డ్ గా వాలిపోయిన ఈ బ్యూటీ తన అందాలను వైట్ దుపట్టాతో కవర్ చేసింది. ఇక తన థై థండర్ షోస్ కి కొదవేమీ లేదు. కళ్లకు ఖరీదైన రేబాన్ ధరించి అల్ట్రా స్టైలిష్ గా కనిపిస్తోంది. 45 ప్లస్ లోనూ అమీషా అందచందాలు కుర్రకారు గుండెల్లో గుబులు రేపుతున్నాయి. ప్రస్తుతం ఈ ఫోటో అంతర్జాలంలో వైరల్ గా మారింది. ప్రస్తుతం పంజాబీ చిత్రాల్లో అమీషా బిజీ అవుతోంది.  దేశీ మ్యాజిక్ .. ది గ్రేట్ ఇండియన్ కేసినో- తౌబా తేరా జల్వా- ఫౌజీ వంటి చిత్రాల్లో నటిస్తోంది. వీటిలో దేశీ మ్యాజిక్ చిత్రాన్ని అమీషా స్వయంగా నిర్మిస్తోంది.