పాక్ నటుడితో డేటింగ్ పై అమీషా క్లారిటీ

Sat Oct 01 2022 06:00:01 GMT+0530 (India Standard Time)

Ameesha Clarity on Dating Pak Actor

పాకిస్తాన్ నటుడు ఇమ్రాన్ అబ్బాస్..బాలీవుడ్ బ్యూటీ అమీషా పటేల్ మధ్య కొంత కాలంగా ఎఫైర్ సాగుతుందంటూ సోషల్ మీడియా కథనాలు వెడెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఇద్దరు జంటగా విదేశాల్లో కెమెరాకి చిక్కడం..ఇన్ స్టా రీల్స్ చేయడం...క్లోజ్  గా మూవ్ అవ్వడం..హగ్ చేసుకోవడం  వంటి సన్నివేశాలతో ఇద్దరి మధ్య స్నేహాన్ని  మించిన బంధం బలపడిదంటూ నేషనల్ మీడియా సహా పాక్ మీడియా  కథనాలు  అంతకంతకు వెడెక్కించాయి.సోషల్ మీడియాలో ఈ జంట గురించి రచ్చ..చర్చ గురించైతే చెప్పాల్సిన పనిలేదు. భారతీయ పౌరురాలు పాకిస్తానీ ని  ఎలా ప్రేమిస్తుందంటూ ఆగ్రహా జ్వాలలే ఎగసి పడ్డాయి. సానియా మిర్జా తర్వాత పాక్ ప్రేమికురాలి చరిత్రలో నిలిచిపోతుందంటూ తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లు వెత్తాయి. తాజాగా ఈ వార్తలపై అమీషా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది.

మీడియాలో వస్తోన్నవన్నీ తప్పుడు కథనాలు. `ఇమ్రాన్ నాకు చాలా కాలంగా తెలుసు. అమెరికాలో  చదువుకున్నప్పుడే అతనితో పరిచయం ఉంది. అప్పుడే ఇద్దరం స్నేహితులం అయ్యాం. అతను కూడా పరిశ్రమకి చెందని వ్యక్తి కావడంతో ఇద్దరం తరుచూ మాట్లాడుకునే వాళ్లం. అప్పుడప్పుడు కలుసుకునే వాళ్లం. ఇటీవలే అతన్ని కలిసా.

ఆ సమయంలోనే ఓ హిందీ పాటకి రీల్స్ చేసాం. బాగుందని సోషల్ మీడియాలో షేర్ చేసా. అది వైరల్ కావడంతో ఇద్దరి మధ్య ఏదో ఉందని అల్లేసారు. డేటింగ్ లవ్...పెళ్లి అంటూ కథనాలు అకస్మాతుగా పుట్టుకొచ్చాయి. వాటిని చూసి నవ్వుకున్నా` అని అన్నారు. ఇటీవలే బహ్రెయిన్ వెళ్లిన అమీషా..అబ్బాస్ ఇతర స్నేహితులతో కలిసి సరదాగా ఎంజాయ్ చేసారు.

ఆ సమయంలోనే  ఓ హోటల్ లో రీల్స్ చేసారు. ఇక అమీషా  టాలీవుడ్ కి సుపరిచితమే. `బద్రీ` సినిమాతో పరిచయమైన అమ్మడు అటుపై మరికొన్ని సినిమాల్లో నటించింది. కానీ తెలుగులో ఆశించిన విధంగా కెరీర్ సాగలేదు. ఈ క్రమంలోనే బాలీవుడ్ లో బిజీ అయింది. ప్రస్తుతం హిందీలో నాలుగైదు సినిమాలు చేస్తోంది. గతంతో పోల్చుకుంటే ఈ ఏడాదే అమ్మడి చేతిలో ఎక్కువ ప్రాజెక్ట్ లు కనిపిస్తున్నాయి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.