Begin typing your search above and press return to search.

సరికొత్త ప్రయోగంకు శ్రీకారం చుట్టిన అమెజాన్‌ ప్రైమ్‌

By:  Tupaki Desk   |   24 Sep 2021 11:32 AM GMT
సరికొత్త ప్రయోగంకు శ్రీకారం చుట్టిన అమెజాన్‌ ప్రైమ్‌
X
ఇండియాలో ఓటీటీ ఆధరణ అనూహ్యంగా పెరిగింది. కరోనా కారణంగా ప్రేక్షకులు ఎంటర్‌ టైన్మెంట్‌ కోసం ఓటీటీలను ఆశ్రయిస్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా అమెజాన్‌ తో పాటు ఇతర ఓటీటీ ప్లాట్‌ ఫామ్స్ ఓ రేంజ్ లో ఖాతాదారులను సొంతం చేసుకున్నారు. రాబోయే అయిదు సంవత్సరాల్లో ఓటీటీ మార్కెట్‌ ఇండియాలో విపరీతంగా పెరుగుతుందని కరోనాకు ముందు అనుకున్నారు. కాని ఈ ఏడాదిన్నర కాలంలో పదేళ్లు అడ్వాన్స్ అన్నట్లుగా ఓటీటీ బిజినెస్‌ జరిగింది. ఇండియాలో టాప్‌ ఓటీటీల్లో అమెజాన్ ప్రైమ్‌ ఒకటి. వందల కోట్లు పెట్టి సినిమాలు వెబ్‌ సిరీస్ లను ప్రేక్షకులకు అమెజాన్ అందిస్తున్నారు. ఇప్పుడు కొత్తగా అమెజాన్ వారు ఇతర ఓటీటీలను కూడా తమ ఓటీటీలోనే యాడ్ ఆన్‌ ప్యాకేజీల మాదిరిగా తీసుకు వచ్చే ప్రయోగంకు శ్రీకారం చుట్టారు.

అమెజాన్‌ ఖాతాదారులు ఇతర ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌ లోని కంటెంట్ ను చూడాలి అనుకుంటే ప్రత్యేకంగా తీసుకోనక్కర్లేదు. అమెజాన్ లోనే యాడ్‌ ఆన్ ప్యాకేజీల రూపంలో ఏది కావాలంటే దాన్ని ఎంపిక చేసుకుని అమౌంట్ ను పే చేస్తే సరిపోతుంది. అంటే అమెజాన్ ఖాతాదారులు డిస్కవరీ ప్లస్ లోని కంటెంట్‌ ను చూడాలంటే సపరేట్‌ గా ఆ సబ్‌ స్క్రిప్షన్‌ ను 399 పెట్టి తీసుకోకుండా కేవలం 299 రూపాయలతో యాడ్‌ ఆన్ ప్యాకేజీ చేసుకోవచ్చు. అప్పుడు అమెజాన్ తో పాటు డిస్కవరీ ప్లస్‌ ను కూడా చూడవచ్చు. అమెజాన్ తాజాగా ముబి.. ఈరోస్‌ నౌ.. డిస్కవరీ ప్లస్‌.. డక్యూబీ మరో నాలుగు ప్రముఖ ఓటీటీలను కూడా యాడ్‌ ఆన్‌ ఓటీటీలుగా చేర్చడం జరిగింది. ముందు ముందు మరిన్ని ఓటీటీలతో అమెజాన్ చర్చలు జరిపి వాటితో కూడా ఒప్పందం కుదుర్చుకునే అవకాశాలు ఉన్నాయి.

ఈ పద్దతి గతంలో ఉన్నా కూడా ఎక్కువగా ప్రాచుర్యం పొందలేదు. కాని అమెజాన్ వంటి పెద్ద ప్లాట్‌ పామ్ వారు ఈ యాడ్ ఆన్ కాన్సెప్ట్‌ ను తీసుకు రావడం వల్ల ఖచ్చితంగా జనాలు ఆకర్షితులు అవ్వడం ఖాయం అంటున్నారు. అమెజాన్‌ ఇండియాలో నెం.1 గా నిలిచేందుకు గాను చేస్తున్న ప్రయత్నాల్లో ఇది ఒకటి అంటూ మార్కెట్‌ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. భారీ ఎత్తున అమెజాన్ వారు పెద్ద సినిమాలు.. వెబ్‌ సిరీస్ లపై ఖర్చు పెడుతోంది. ఆ కంటెంట్‌ తో పాటు ఇతర ఓటీటీల కంటెంట్‌ కూడా ఇప్పుడు అమెజాన్ ప్రైమ్‌ వీడియోలో చూసే అవకాశాలు ఉన్నాయి కనుక మరింత మంది సబ్‌ స్క్రిప్షన్ తీసుకుంటారని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బాలీవుడ్‌ తో పాటు సౌత్‌ లో కూడా వెబ్‌ సిరీస్ ల సందడి కొనసాగుతోంది. అమెజాన్‌ వారు వందల కోట్లతో వెబ్‌ సిరీస్ లను ప్లాన్‌ చేస్తున్నారు.