స్టార్ హీరో మూవీని మించి అమ్ముడైన 'యాత్ర'

Mon Feb 11 2019 20:26:05 GMT+0530 (IST)

Amazon Prime Deal For YSR Biopic Yatra Movie

'యాత్ర' మూవీ సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. మూడు రోజుల్లోనే ఈ చిత్రం బడ్జెట్ లో సగానికి పైగా వసూళ్లు చేసినట్లుగా తెలుస్తోంది. మొదటి వారం రోజుల్లోనే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధిస్తుందనే నమ్మకంను ట్రేడ్ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాలు ఓవర్సీస్ కేరళలో ఈ చిత్రం సాధిస్తున్న వసూళ్లతో నిర్మాతలకు కాసుల పంట ఖాయం అయ్యింది. ఒక వైపు వసూళ్లు భారీగా వస్తున్న నేపథ్యంలో మరో వైపు డిజిటల్ రైట్స్ శాటిలైట్ రైట్స్ రూపంలో ఈ చిత్రం భారీ ఎత్తున బిజినెస్ చేస్తోంది.ఈమద్య కాలంలో స్టార్ హీరోల సినిమాలకు అమెజాన్ ప్రైమ్ భారీ రేటును పెట్టి కొనుగోలు చేస్తుంది. చిన్న చిత్రాలను కనీసం పట్టించుకునే పరిస్థితి లేదు. కాని 'యాత్ర' సినిమాను మాత్రం స్టార్ హీరోల సినిమాను మించి రేటు పెట్టి కొనుగోలు చేసింది. యాత్ర సినిమాకు అమెజాన్ ప్రైమ్ ఏకంగా 8 కోట్లకు అటు ఇటుగా పెట్టినట్లుగా సినీ వర్గాల ద్వారా తెలుస్తోంది.

అమెజాన్ రైట్స్ ద్వారానే బడ్జెట్ లో సగానికి అటు ఇటుగా రాబట్టిన యాత్ర ఇక శాటిలైట్ రైట్స్ డబ్బింగ్ రైట్స్ ద్వారా మరింతగా దక్కించుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. కేవలం అమెజాన్ రైట్స్ శాటిలైట్ రైట్స్ డబ్బింగ్ రైట్స్ తోనే నిర్మాతలు సేఫ్ జోన్ లోకి వెళ్లే పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి యాత్ర సినిమా సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. వైఎస్ ఆర్ ఇంకా ప్రజల గుండెల్లో ఉన్నాడనేందుకు ఈ సినిమా సక్సెస్ ప్రత్యక్ష సాక్ష్యంగా నిలిచింది.