Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: హంస కాదు హ‌ఠ యోగిని

By:  Tupaki Desk   |   24 Jan 2021 2:30 AM GMT
ఫోటో స్టోరి: హంస కాదు హ‌ఠ యోగిని
X
ఆమె చిత్రంలో న‌గ్నంగా న‌టించి షాకిచ్చిన అమ‌లాపాల్ ఆ త‌ర్వాత హ‌ఠ‌యోగినిగా మారి యోగా క్లాసులు తీసుకున్న సంగ‌తి తెలిసిందే. ఆరోగ్యం.. ధార్మిక‌త.. నేచుర‌ల్ లివింగ్ అంటూ ర‌క‌ర‌కాలుగా క్లాసులు తీసుకుంది. కేర‌ళ‌లోని ఆయుర్వేదానికి ప్రాచుర్యం క‌ల్పించే ప్ర‌య‌త్నం చేసింది.

`ఆమె` త‌ర్వాత ఇప్పుడు హంసా నందిని అదే జోనర్ లో చేరింది. ఈ భామ తాజాగా హ‌ఠ యోగినిలా మారిన ఫోటో ప్ర‌స్తుతం వైర‌ల్ గా మారింది. హంస యోగాభ్యాసం సూర్య న‌మ‌స్కారాల‌కు అభిమానుల నుంచి స్పంద‌న అంతే ఇదిగా ఉంది.

ప్ర‌కృతి ర‌మ‌ణీయ‌త ప‌చ్చందాల న‌డుమ ఇదిగో ఇలా సూర్య న‌మ‌స్కారాల‌ను ఆచ‌రిస్తోంది. అయితే ఆ భంగిమ‌కు అలా పొట్టి ఫ్రాకునే ఎందుకు ఆశ్రయించింది? ఎందుకా థై సొగ‌సుల ఎలివేష‌న్? అంటూ కామెంట్లు అంతే జోరుగా ప‌డిపోతున్నాయ్. ఇటీవ‌ల వంట‌ల కార్య‌క్ర‌మాల‌తో ఇన్ స్టా వేదిక‌గా వేడెక్కించిన హంస ఇంత‌లోనే యోగా గురూగా మారిపోయింది.. ఏం జ‌రుగుతోంది? అంటూ అభిమానుల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. హంస తిరిగి హాట్ ఐటెమ్ నంబ‌ర్ల‌తో మెర‌వాల‌న్న అభిమానుల కోరిక ఎప్ప‌టికి నెర‌వేరేనో?