బాస్ తో రొమాన్స్ .. ఘాటు తగ్గిస్తారట

Tue Oct 08 2019 10:09:59 GMT+0530 (IST)

Amala Paul to Romance with Jagapathi Babu in Telugu Lust Stories

వెబ్ సిరీస్ లు అంటే మునుపటిలా కాదు. ఉత్తరాది ఆడియెన్ కి పాశ్చాత్య బాణీలో కాస్తంత ఘాటుగానే తీర్చిదిద్దుతున్నారు. రొమాన్స్ విషయంలో పెదవి ముద్దుల మ్యాటర్ లో ఏమాత్రం తగ్గడం లేదు. అమ్మాయి అబ్బాయి ఎఫైర్ సీన్స్ లో అయితే జీవించేస్తున్నారు. తాజాగా అమలాపాల్ - జగపతిబాబు జోడీగా లస్ట్ స్టోరీస్- తెలుగు వెబ్ సిరీస్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.ఇందులో బాస్ తో రొమాన్స్ చేసే అందమైన అమ్మాయి లస్ట్ కథేంటి అన్నది ఆసక్తికరం. జగ్గూ భాయ్-అమలాపల్ జోడీ మధ్య ఘాటైన రొమాన్స్ .. అదరచుంబనాలు.. బెడ్ రూమ్ సన్నివేశాలు ఉంటాయి. అయితే వాటిని హిందీ వెర్షన్ తరహాలోనే ఘాటుగానే చూపిస్తారా? అంటే అబ్బే అలాంటిదేం లేదు. మన ఆడియెన్ కి తగ్గట్టే బ్లర్ చేసేస్తామని.. ఘాటైన వ్యవహారం తగ్గిస్తామని చెబుతున్నారట. అలా అయితే యూత్ నిరాశపరడడం ఖాయం. ఇక ఈ వెర్షన్ కి నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తుండడం మరో ఇంట్రెస్టింగ్ మ్యాటర్. అందుకే రొమాన్స్ స్థాయిని తగ్గించి టోన్ డౌన్ చేస్తారట.

లస్ట్ స్టోరీస్ ఇప్పటికే హిందీలో బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న వెబ్ సిరీస్. దానిని ఇప్పుడు నిర్మాత రోనీ స్క్రూవాలా తెలుగు ప్రేక్షకులకు అందించే ప్రణాళికలో ఉన్నారు. తెలుగు రీమేక్ కి నందిని రెడ్డి- సందీప్ రెడ్డి వంగా- సంకల్ప్ రెడ్డి-తరుణ్ భాస్కర్ వంటి దర్శకుల్ని ఎంపిక చేశారు. కొన్ని విడి విడి కథల సమాహారం లస్ట్ స్టోరీస్. ఇందులో ఒక్కో స్టోరీకి ఒక్కొక్కరు దర్శకత్వం వహిస్తున్నారు. నందిని రెడ్డి ఇప్పటికే తన వెర్షన్ కథను రెడీ చేసుకుని సెట్స్ కెళుతున్నారు. అమలాపాల్ - జగ్గూ భాయ్ మధ్య సీన్స్ తెరకెక్కించే పనిలో జాగ్రత్తలు తీసుకోబోతున్నారట.