ఫోటో స్టొరీ: కేరళ కొబ్బరి ముక్క

Thu Sep 12 2019 14:12:26 GMT+0530 (IST)

Amala Paul Stuns in Tradition Attire

కేరళ బ్యూటీ అమలా పాల్ పేరు తెలియదని ఎవరైనా సౌత్ సినీ ప్రియుడు అన్నాడంటే వాడికి బొత్తిగా కళాపోషణ లేనట్టే.  కనీసం వివాదాల వార్తలు కూడా ఫాలో అవ్వని బతుకూ ఒక బతుకేనా?  డైరెక్టర్ AL విజయ్ తో ప్రేమ వివాహం.. అ తర్వాత గొడవలు - విడాకులు..  లగ్జరీ కారు టాక్స్ ఎగవేత ఆరోపణలు.. ఒక తమిళ హీరో తో ఎఫైర్ రూమర్లు.. నగ్నంగా నటించడం.. ఇలాంటి సెన్సేషన్లు వివాదాలు ఉన్న నటి పేరు తెలియకపోతే అది సాధారణమైన విషయం కానే కాదు.సరే వివాదాలు అన్నీ పక్క పెట్టి పూర్తిగా ట్రెడిషనల్ గా మారిపోండి.  మనం మారినా మారకపోయినా అమలా పాల్ మారిపోయింది. పైకి ఎంత మాసు అయినా లోపల అమల 'న్యాన్ మలయాళి' కదా. అందుకే మలయాళ ప్రజలకు మనసుకు దగ్గరగా ఉండే ఓనమ్ పండగను తనివితీరా జరుపుకుంది.  ఈ పండగ సందర్భం ఆ కేరళ రుచులతో కూడిన రుచికరమైన భోజనం 'సాద్య' ను ఫుల్ గా ఆస్వాదించిందట.  ఈ విషయాన్ని తెలుపుతూ ఒక కత్తి లాంటి ఫోటో పోస్ట్ చేసి "సాద్య తర్వాత ఫుడ్ కోమాలో ఉన్నా" అంటూ క్యాప్షన్ ఇచ్చింది.  అయినా అమలకు సవత్సరానికి ఒక్కసారే ఫుడ్ కోమా.  కానీ హైదరబాద్ లో జనాలకు రోజూ ఫుడ్ కోమానే.. బిర్యానీలు తిన్న ప్రతి సారి అలానే ఉంటుంది కదా? అయినా ఈ ఫుడ్ కోమా పదం భలేగా ఉంది కదా?

ఎంతసేపూ తిండిగోల అనుకుంటారేమో. ఫోటో గోల కూడా ఉంది.  ఫోటోలు అమల ఎంతో ట్రెడిషనల్ గా చీర కట్టుకుని అందంగా పోజిచ్చింది.  ఆభరణాలు.. హెయిర్ స్టైల్ అబ్బో వర్ణించడానికి మాటలు సరిపోవు.  అంత అందంగా ఉంది. ఇక ఫోటో తీసుకున లొకేషన్ కూడా సూపర్.  అయితే ఈ ఫోటో మొత్తానికి మరో హైలైట్ ఉంది.  అదేంటంటే కొబ్బరి చెట్టు. ఎంతైనా కేరళ పాప కదా? కొబ్బరి చెట్టు సంగతి పక్కన పెడితే ఈ ఫోటోకు భలే భలే కామెంట్లు పెట్టారు నెటిజన్లు. "నేను లవ్ కోమా లో ఉన్నా"..  "కేరళ డైమండ్".. "మలయాళీ దేవత" అంటూ నెటిజన్లు రెచ్చిపోయారు. ఇంకా చాలామంది హ్యాపీ ఓనమ్ కూడా చెప్పారు.