Begin typing your search above and press return to search.

ప్ర‌శాంత‌త కోసం యోగినిలా మారి త‌ప‌స్సు చేస్తున్న‌ అమలా

By:  Tupaki Desk   |   21 Oct 2020 4:00 AM GMT
ప్ర‌శాంత‌త కోసం యోగినిలా మారి త‌ప‌స్సు చేస్తున్న‌ అమలా
X
యోగిని శాఖిని డాకినీ .. అంటూ కాస్తో కూస్తో శాస్త్రం తెలిసిన వాళ్లు రూపాన్ని బ‌ట్టి పేర్లు పెట్టి పిలుస్తుంటారు. ఇక్క‌డ చూస్తున్న ఆమె ఎవ‌రు? యోగిని.. శాఖిని.. డాకినీ.. ఏ పేరైతే ఏంటి? కానీ ఆమె మునీశ్వ‌రి అని మాత్రం అర్థ‌హ‌వుతోంది. ఆ నుదుటిన అర్థ‌చంద్రాక‌ర తిల‌కం.. మెడ‌లో రుద్రాక్ష పూస‌లు.. ఎంతో సాధా సీదాగా ఉన్న ఆ దుస్తులు.. చూస్తున్న చూపు.. ఇదంతా చూస్తుంటే ఈ యోగినికి ఏమైంది? అంటూ కుర్ర‌కారు తెగ ఇదైపోతున్నారు.

ఇంత‌కీ ఎవరు చెప్మా? అంటారా.. ఆమె అమ‌లాపాల్. ఇటీవ‌లి కాలంలో ఆమెలోని వేదాంత ధోర‌ణి అంద‌రికీ షాకిస్తోంది. ఆధ్యాత్మిక ధోర‌ణితో చెల‌రేగుతూ నిరంత‌రం బోయ్స్ కి చుక్క‌లు చూపిస్తోంద‌నే చెప్పాలి. సినిమాల‌తో కంటే ఈ త‌ర‌హా ప‌బ్లిసిటీతో పాల్ స‌ర్రున దూసుకుపోతోంది. ఇక ఆమె (ఆడై) త‌ర్వాత మ‌రో ప్ర‌యోగానికి శ్రీ‌కారం చుట్టిన అమ‌లాపాల్ ..ఇలా నిత్య‌నూత‌నంగా ట్రెండీ ఫోటోషూట్ల‌తో విరుచుకుప‌డుతోంది.

ఇప్ప‌టికే అమ‌లాపాల్ ఇన్ స్టా ఫోటో ఆల్బ‌మ్ ప‌రిశీలిస్తే.. ఇందులో యోగిని లుక్ తో పాటు బిజిలీ లుక్ .. కొండ మ‌ల్లి బొండు మ‌ల్లి త‌ర‌హా లుక్ లు హీట్ పెంచేస్తున్నాయి. మ‌రోవైపు మోడ్ర‌న్ ఔట్ ఫిట్ లోనూ అమ్మ‌డు దుమారం రేపుతోంది. దేవీ న‌వ‌రాత్రుల సంద‌ర్భంగా ఈ స్పెష‌ల్ గెట‌ప్. ఉపవాస ధీక్ష‌ల‌తో వ్ర‌తాలు నోములు నోస్తోంది పాల్.

మూడవ రోజు దేవి చంద్రఘట దేవి అధ్యక్షత వహిస్తారు! అన్న క్యాప్ష‌న్ తోనే విష‌యం అర్థ‌మ‌య్యేలా చెప్పేసింది పాల్. ఆమె జీవితంలో శాంతి.. ప్రశాంతత .. శ్రేయస్సు కోసం పూజలు ఇవి. ఆమెకు చంద్ర.. స్థితి ఉంది. లేదా ఆమె నుదిటిలో సగం చంద్రుడు `ఘంటా` లేదా గంట ఆకారంలో ఉంటుంది. ఆమె మనోహరమైనది. బంగారు వ‌ర్ణంలో ప్రకాశవంతమైన రంగు కలిగి ఉంది. సింహాన్ని నడుపుతుంది. ఆమెకు పది చేతులు.. మూడు కళ్ళు ఉన్నాయి .. చేతుల్లో ఆయుధాలు ఉన్నాయి. ఆమె ధైర్యానికి ధీర‌.. రాక్షసులతో పోరాడటానికి గొప్ప శక్తిని కలిగి ఉంది... అంటూ దేవీ గొప్ప‌త‌నాన్ని పాల్ వ‌ర్ణించింది.

మీ మనస్సును అనారోగ్యాల సృష్టికర్తగా మార్చవద్దు. దీన్ని మీ అనారోగ్యాలకు వ్యాఖ్యాతగా చేసుకోండి. మీ మనస్సును మచ్చిక చేసుకోవడానికి ఉపవాసం.. తపస్సు .. ధ్యానం వంటి పురాతన పద్ధతులను ఉపయోగించండి. జీవితంలో అతి ముఖ్యమైన విషయం శాంతి. మీరు మీదైన‌ వేగంతో వెళ్ళండి. కానీ మీరు తప్పక శాంతి పొందాలి!

నా ప్రియమైన చంద్రులారా, మీ చేతులతో చేరండి. దేవి ఆశీర్వాదం కోరుకుంటారు. నిరంతరాయమైన శాంతిని అడగండి. మీరు అడిగినప్పుడు మీరు సమృద్ధిగా అందుకుంటారు. నా శాంతిలో పాలుపంచుకోవాలని నేను ఈ రోజు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను... అంటూ సుదీర్ఘ‌మైన లేఖ‌నే రాసింది పాల్. మొత్తానికి ప్ర‌శాంత‌త కోసం యోగినిలా మారింద‌న్న‌మాట‌.