ఫోటో స్టోరి: అలా చేతులెత్తేయకు అమ్మడూ?

Tue Aug 11 2020 13:40:59 GMT+0530 (IST)

Amala Paul Stunning Pose In White Dress

అందితే దేనినైనా అందుకోవచ్చు. తారా తీరంలో చుక్కల్ని కూడా కోసి తెచ్చుకోవచ్చు. ఈమాత్రం పాదును పండిన బీరకాయో కాకరకాయో తెంపుకోవడం కష్టమా?  జీవితంలో ఎన్నో చూసి ఎంతో ఎత్తుకు ఎదిగేసిన అమలాపాల్ కి ఇప్పుడు కెరీర్ ని తిరిగి ట్రాక్ లోకి తేవడం కష్టమేమీ  కాదు.అసలు ఈ అమ్మడి ఎత్తుగడలు చూస్తేనే అర్థమవుతోంది. లైఫ్ కి సంబంధించిన రకరకాల ఇష్యూస్ తర్వాత తిరిగి కంబ్యాక్ అయ్యేందుకు అమలాపాల్ చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. బెంజి కార్ పన్ను తగ్గుతుందని యానాం వెళ్లి కొనుక్కున్నా.. మొన్నటికి మొన్న నగ్న కాన్సెప్టుతో `ఆమె` లాంటి వివాదాస్పద సినిమాలో నటించినా ఈ అమ్మడికే చెల్లింది. ఏదైతేనేం.. పాల్ ఇచ్చే ట్రీట్ ని మొహమాట పడక యూత్ అంతే తపనతో క్యాచ్ చేస్తోంది.

తాజాగా అమలాపాల్ షేర్ చేసిన ఫోటోషూట్ అంతర్జాలంలో వైరల్ గా మారింది. పొట్టి డెనిమ్ నిక్కరు.. అంతే పొట్టిగా ఉన్న వైట్ టాప్ తో దుమారమే రేపుతోంది. మరీ అలా అందుకునే ప్రయత్నం చేస్తుంటే కుర్రాళ్ల చూపులన్నీ అటేగా.. ఇక అంతేగా! అయినా ఇలాంటి ట్రిక్కులు జిమ్మిక్కులు ప్లే చేసి ఎందుకలా పరేషాన్ చేస్తావు?  అన్నట్టు.. ఆమె తర్వాత ఈ అమ్మడు లస్ట్ స్టోరీస్ తెలుగు వెబ్ సిరీస్ లో నటిస్తోంది. అది ఎప్పటికి కన్నుల పండుగ చేసేందుకు వస్తుందోనని యూత్ పదే పదే నిట్టూరుస్తున్నారు. దానికి అయినా కనీసం సమాధానం చెబుతావా పాల్?