పిక్ టాక్ : బాబోయ్ మరీ ఇంతగా చూపిస్తుందేంటీ?

Mon Sep 26 2022 05:32:18 GMT+0530 (India Standard Time)

Amala Paul Latest Photo

తమిళ సినిమాతో సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన అమలా పాల్ తక్కువ సమయంలోనే ఎక్కువగా గుర్తింపు దక్కించుకుంది. తెలుగు లో కూడా ఈ అమ్మడి యొక్క జోరు ఓ రేంజ్ లో సాగింది. తక్కువ సమయంలోనే అల్లు అర్జున్.. రామ్ చరణ్ వంటి స్టార్ హీరోలకు జోడీగా నటించే అవకాశం దక్కింది. ఇంకా ముందు ముందు మరిన్ని పెద్ద తెలుగు సినిమాల్లో నటించే అవకాశం ఉందని అంతా భావించారు.హీరోయిన్ గా మంచి ఫామ్ లో ఉన్న సమయంలోనే ప్రేమించిన వ్యక్తి ని వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత సినిమాల్లో బిజీ అవ్వాలని ఆమె ఆశ పడింది. కానీ మొత్తం రివర్స్ అయ్యింది. పెళ్లి తర్వాత కుటుంబ గొడవలు ఇతరత్రా కారణాల వల్ల విడాకులు తీసుకుంది. పెళ్లి.. విడాకుల తర్వాత టాలీవుడ్ లో పూర్తిగా ఈమెకు ఆఫర్లు లేకుండా పోయాయి. ముద్దుగుమ్మ అమలా పాల్ రీ ఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

ఇప్పటికే తమిళంలో మెల్ల మెల్లగా సినిమాలు చేస్తూ కెరీర్ లో ముందుకు సాగుతున్న ముద్దుగుమ్మ అమలా పాల్ తెలుగు లో మాత్రం అస్సలు ఛాన్స్ లను దక్కించుకోలేక పోతుంది. ఎంతగా ప్రయత్నించినా కూడా ఆఫర్లు మాత్రం అంతంత మాత్రంగానే వస్తున్నాయి. దాంతో ఇలా సోషల్ మీడియాలో హీట్ పెంచే ఫోటోలను షేర్ చేయడం ద్వారా ఫిల్మ్ మేకర్స్ దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది.

హీరోయిన్ గా ఈ అమ్మడు చేసిన సినిమాల కంటే కూడా ఈ మధ్య కాలంలో ఈమె యొక్క హాట్ ఫోటో షూట్స్ ఎక్కువగా ఈమెకు పేరును గుర్తింపును తెచ్చి పెట్టాయి అంటూ కామెంట్స్ వస్తున్నాయి. సోషల్ మీడియాలో అందాల ఆరబోత కామన్ అయ్యింది. ఈమె యొక్క స్కిన్ షో కి రెగ్యులర్ గా ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.

తాజాగా ఇలా స్విమ్ సూట్ లో కనిపించి హీట్ పెంచింది. మరీ ఇంతగా చూపించడం ఏంటి అమ్మడు అంటూ అమలా పాల్ అందాల ఆరబోతకి ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఇంతగా స్కిన్ షో చేస్తున్న అమలా పాల్ కి మళ్లీ టాలీవుడ్ లో ఒక మంచి ఎంట్రీ దక్కేనా చూడాలి.