Begin typing your search above and press return to search.

రెడ్ కార్పెట్ పై వేడెక్కించే భంగిమలో కేరళ కుట్టి!

By:  Tupaki Desk   |   17 July 2020 2:30 AM GMT
రెడ్ కార్పెట్ పై వేడెక్కించే భంగిమలో కేరళ కుట్టి!
X
తెలుగు ప్రేక్షకులకు 'ప్రేమఖైది' అనే తమిళ అనువాద సినిమాతో పరిచయం అయింది కేరళ కుట్టి అమలాపాల్. ఆర్జీవీ రూపొందించిన 'బెజవాడ'తో తెలుగులో స్ట్రెయిట్ సినిమా చేసింది. ఇప్పటి వరకు తెలుగులో తక్కువ సినిమాలలో కనిపించింది. ఎక్కువగా తమిళంలో చేసింది. ఈ బ్యూటీ తన నటనతో, అందాలతో మంచి క్రేజ్ సంపాదించుకుంది. 'నాయక్'.. 'ఇద్దరమ్మాయిలతో'' సినిమాలలో నటించి తక్కువ టైంలోనే ఇండస్ట్రీని ఆకర్షించింది. కానీ తెలుగులో స్టార్ హీరోయిన్ హోదా మాత్రం దక్కించుకోలేక పోయింది. అల్లు అర్జున్, రాంచరణ్ లతో నటించినా ఇండస్ట్రీలో సరైన అవకాశాలు రాలేదని చెప్పాలి. గత కొన్నేళ్లుగా టాలీవుడ్ దర్శక నిర్మాతలు కూడా అమ్మడి వైపు కన్నెత్తి చూడట్లేదు.

కెరీర్ అంతా ముగిసిందని అనుకుంటున్న టైంలో త‌మిళ‌, మ‌ళ‌యాల ఇండ‌స్ట్రీల‌పై దృష్టి పెట్టి బిజీ అవుతోందని అనుకున్నారు. అయితే కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడే తమిళ దర్శకుడు విజయ్ తో పెళ్లి అయిందని షాక్ ఇచ్చింది. అభిమానులు కాస్త నిరాశ చెందినా.. సరే అని ఊరుకున్నారు. కానీ అందరూ అనుకున్న ఆలోచనలను తారుమారు చేసింది. కొద్దిరోజులకే మనస్పర్థల కారణంగా వీరిద్దరూ విడిపోయారు. ఆ తర్వాత కాస్త గ్యాప్ తీసుకొని సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టింది. ఇక విఐపి2, ఆమె సినిమాలతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇదిలా ఉండగా తాజాగా అమలాపాల్ ఒక వెబ్ సిరీస్ లో నటించబోతోందట. ఇప్పుడు అందరూ డిజిటల్ స్ట్రీమింగ్‌ వైపే అడుగేస్తున్నారు.

దాంతో ఫిల్మ్ ఇండస్ట్రీస్ కూడా డిజిటిల్ వైపు పరుగులు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. హిందీలో మహేష్ భట్, జియో స్టూడియోస్ తెరకెక్కిస్తున్న వెబ్ సిరీస్‌లో అమలాపాల్ నటిస్తోంది. లాక్ డౌన్ కారణంగా అమలాపాల్ ఫోటోషూట్లతో రెచ్చిపోతుంది. తాజాగా రెడ్ కార్పెట్ పై బ్లాక్ స్కర్ట్ ధరించి అభిమానులకు కిక్కిస్తోంది. చూసినవాళ్ళకి చూసినంత అన్నట్లుగా ఈ మధ్య అమల అందాల ఆరబోత చేస్తోంది. ఆ రెడ్ కార్పెట్ లో అమ్మడి మేనిఛాయ నిగనిగ మెరుస్తోంది. ఆ ఎర్రని పరుపు పై పిల్లోల మధ్య రొమాంటిక్ లుక్ తో సెగలు రేపుతోంది సుందరి. ఈ డ్రెస్ లో గనక అమ్మడు పార్టీకి వెళ్తే ఖచ్చితంగా పార్టీలో హైలైట్ అవుతుందని అంటున్నారు నెటిజన్లు. ప్రస్తుతం ఆ పిక్ అంతలా ఆకట్టుకుంటోంది మరి. మీరు ఓ లుక్కేయండి.