ఆల్ టైమ్ క్లాసిక్ మూవీ డైరెక్టర్ పరిస్థితేంటీ ఇలా వుంది?

Tue Jan 24 2023 11:50:41 GMT+0530 (India Standard Time)

Alphonse Puterin status of a classic movie director?

నచ్చితే ఆకాశానికి ఎత్తేయడం.. నచ్చకపోతే పాతాళానికి తొక్కేయడం తెలిసిందే. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే ట్రెండ్ నడుస్తోంది. నచ్చిన సినిమాని ఆకాశానికి ఎత్తేస్తూ బ్రహ్మరథం పడుతున్నారు. అదే సమయంలో సినిమా బాగాలేకపోయినా.. ఎంచుకున్న కథ కథనాలు మేకింగ్ విషయంలో ఎలాంటి తప్పులు దొర్లినా నెట్టింట చెడుగుడు ఆడేస్తున్నారు. ఇప్పుడు ఇలాంటి పరిస్థితినే క్లాసిక్ మూవీ డైరెక్టర్ ఎదుర్కొంటుండటం పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.వివరాల్లోకి వెళితే.. నవీన్ పౌలి సాయి పల్లవి అనుపమా పరమేశ్వరన్ మడోన్నాసెబాస్టియన్ కీలక పాత్రల్లో నటించిన ఆల్ టైమ్ క్లాసిక్ 'ప్రేమమ్'. ఆల్ఫోన్స్ పుతెరిన్.  ప్రేమ కథా చిత్రాల్లోనే ఈ మూవీ అన్ని భాషల్లోనూ ఆల్ టైమ్ క్లాసిక్ ఫిల్మ్ అనిపించుకుంది. 2016లో విడుదలైన ఈ మలయాళ మూవీపై సర్వత్రా ప్రశంసల వర్షం కురిసింది. శంకర్ సెల్వరాఘవన్ స్టార్ హీరో విజయ్ ఈ మూవీపై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ మూవీతో నవీన్ పౌలి సాయి పల్లవి అనుపమా పరమేశ్వరన్ మడోన్నాసెబాస్టియన్ పాపులర్ అయ్యారు.

ఈ సినిమా కారణంగానే సాయి పల్లవి అనుపమా పరమేశ్వరన్ మడోన్నాసెబాస్టియన్ తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఇతర భాషలకు చెందిన పలువురు ఫిల్మ్ మేకర్స్ ని విశేషంగా ఆకట్టుకుంది. ప్రతీ ప్రేమికుడు జీవితంలో మర్చిపోలేని సినిమాగా నిలిచింది.

ఓ యువకుడి జీవితంలో వివిధ దశల్లో చోటు చేసుకునే ప్రేమకథల సమాహారంగా ఈ మూవీని ప్రేమ కథా చిత్రాల్లో బెంచ్ మార్క్ ని సెట్ చేసింది. దీంతో ఈ మూవీని తెలుగులోనూ అదే పేరుతో రీమేక్ చేశారు. నాగచైతన్య హీరోగా నటించిన ఈ మూవీలో శృతిహాసన్ అనుపమా పరమేశ్వరన్ మడోన్నాసెబాస్టియన్ హీరోయిన్ లుగా నటించారు.  

ఇండియన్ సినిమా హిస్టరీలోనే అద్భుతమైన ప్రేమ కావ్యంగా నిలిచిన ఈ మూవీతో దర్శకుడు అల్ఫోన్స్ పుతెరిన్ పాపులర్ అయ్యాడు. అయితే ఆ స్థాయిలో మాత్రం తను సినిమాలు చేయలేకపోయాడు. ఆరేళ్ల విరామం తరువాత అల్ఫోన్స్ పుతెరిన్ చేసిన మూవీ 'గోల్డ్'. ఇంత కాలం తను ఎందుకు సినిమాలకు దూరంగా వున్నాడో ఎవరికీ తెలియదు. ఆరేళ్ల విరామం తరువాత అల్ఫోన్స్ పుతెరిన్ రూపొందించిన 'గోల్డ్'లో పృథ్వీరాజ్ సుకుమారన్ నయనతార జంటగా నటించారు.

గత ఏడాది డిసెంబర్ లో విడుదలైన ఈ మూవీ ఆశించిన విజయాన్ని దక్కించుకోలేక డిజాస్టర్ గా నిలిచింది. ఫస్ట్ లుక్ పోస్టర్ నుంచే నెటింట వ్యతిరేకతకు గురవుతూ వస్తున్న అల్ఫోన్స్ పుతెరిన్ ని సినిమా రిలీజ్ తరువాత నెటిజన్ లు మరీ దారుణంగా ఆడుకోవడం మొదలు పెట్టారు. ఈ నేపత్యంలో మనస్థాపానికి గురైన దర్శకుడు సోషల్ మీడియా ఫేస్ బుక్ లో తన డీపీని తొలగించి తన నిరసన వ్యక్తం చేశాడు.

అంతే కాకుండా ఇదే తరహాలో తనని దూషిస్తే సోషల్ మీడియా నుంచి నిష్కమిస్తానని హెచ్చరించాడు. అయినా నెలిజన్ ల ట్రోలింగ్ ఆగకపోవడంతో కావాలనే తనని టార్గెట్ చేసి మరీ వేధిస్తున్నారని మండిపడుతున్నాడు. 'ప్రేమమ్' వంటి క్లాసిక్ మూవీని అందించిన దర్శకుడికి ఇలాంటి పరిస్థితి ఏంటని అంతా వాపోతున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.