'అల్లూరి' ఫస్ట్ లుక్: పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా శ్రీవిష్ణు..!

Fri Jul 01 2022 11:00:09 GMT+0530 (IST)

Alluri Movie first look

వర్సటైల్ హీరో శ్రీవిష్ణు కెరీర్ ప్రారంభం నుంచీ విభిన్నమైన జోనర్స్ లో వెరైటీ కాన్సెప్టులతో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. పలు ఆసక్తికరమైన చిత్రాలను లైన్ లో పెట్టిన శ్రీవిష్ణు.. ప్రస్తుతం ''అల్లూరి'' అనే పవర్ ఫుల్ టైటిల్ తో ఓ సినిమా చేస్తున్నారు.'అల్లూరి' అనేది ఓ పోలీస్ ఆఫీసర్ బయోపిక్ గా పేర్కొనబడింది. 'నిజాయితీకి మారు పేరు' అనేది దీనికి ట్యాగ్ లైన్. ప్రదీప్ వర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. బెక్కం బబిత సమర్పణలో లక్కీ మీడియా బ్యానర్ పై బెక్కెం వేణుగోపాల్ నిర్మిస్తున్నారు.

ఈరోజు శుక్రవారం 'అల్లూరి' చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను మేకర్స్ లాంచ్ చేశారు. శ్రీవిష్ణు ఇందులో ఖాకీ యూనిఫాంలో చేతిలో తుపాకీని పట్టుకుని కోరమీసంతో డాషింగ్ గా కనిపిస్తున్నాడు. ఇంటెన్స్ గా చూస్తూ వర్షంలో తడుస్తూ నడుస్తున్నాడు.

శ్రీవిష్ణు ఈ సినిమాలో సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ రామరాజుగా కనిపించనున్నారు. పోలీస్ పాత్రకు తగ్గట్టుగా అతని ట్రాన్స్ఫర్మేషన్ చూసి మెచ్చుకోవాల్సిందే. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

నిజాయితీతో కూడిన కథతో పోలీస్ గొప్పతనాన్ని తెలియజెప్పడం కోసం దర్శకుడు ప్రదీప్ వర్మ తీవ్రంగా పరిశోధించాడని చిత్ర బృందం చెబుతోంది. ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించిన రోజు నుండి ఈ మూవీ ప్రయాణం మొదలవుతుంది. ఈ క్రమంలో ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటాడు? అతను చేసే త్యాగాలు ఏంటి? సమాజం మరియు ఉన్నతాధికారుల నుండి అతను ఎదుర్కొనే ఒత్తిళ్లను ఈ సినిమాలో చూడవచ్చని తెలిపారు.

ఒక పోలీసు అధికారి తన విప్లవాత్మక ఆలోచనలతో మొత్తం డిపార్ట్మెంట్ లో ఎలాంటి మార్పును తీసుకువస్తాడనేది చూపించబోతున్నారు. ఎప్పుడూ డ్యూటీకి ప్రాధాన్యత ఇచ్చే నిజాయితీ గల పోలీసు అధికారులకు 'అల్లూరి' తగిన నివాళులు అర్పించే చిత్రమవుంటుందని మేకర్స్ భావిస్తున్నారు.

'అల్లూరి' సినిమాలో కయాదు లోహర్ కథానాయికగా నటిస్తుండగా.. సుమన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. తనికెళ్ల భరణి - మధుసూధన్ రావు - ప్రమోదిని - రాజా రవీంద్ర - పృధ్వీ రాజ్ - రవివర్మ - జయవాణి - వాసు ఇంటూరి - వెన్నెల రామారావు - శ్రీనివాస్ వడ్లమాని తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు.

టెక్నికల్ క్రూ విషయానికి వస్తే హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం సమకూరుస్తున్నారు. రాజ్ తోట ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. ధర్మేంద్ర కాకరాల ఎడిటర్ గా.. వైటల్ ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నారు. ఒక పాట మినహా 'అల్లూరి' షూటింగ్ మొత్తం పూర్తయింది. త్వరలో విడుదల తేదీని ప్రకటించి.. ప్రమోషన్లను కూడా ప్రారంభిస్తామని చిత్ర బృందం తెలిపింది.