ఇండో పాక్ బోర్డర్ లో పుష్పరాజ్.. వీడియో వైరల్

Fri Sep 30 2022 11:41:50 GMT+0530 (India Standard Time)

AlluArjun at IndoPak Border

అల్లు అర్జున్ తన కుటుంబ సభ్యులతో కలిసి అమృత్ సర్ వెళ్లారు. అక్కడ భార్య స్నేహా రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా గోల్డెన్ టెంపుల్ ని సాధారణ భక్తుల మాదిరిగా దర్శించుకున్నారు.సాంప్రదాయ దుస్తుల్లో గోల్డెన్ టెంపుల్ ను దర్శించుకున్న అల్లు అర్జున్ ఫ్యామిలీ ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. గోల్డెన్ టెంపుల్ దర్శనం తర్వాత బన్నీ వాఘా సరిహద్దుకు వెళ్లారు.

ఇండియా మరియు పాకిస్తాన్ సరిహద్దు అయిన వాఘా బోర్డర్ వద్ద బిఎస్‌ఎఫ్ జవాన్ లతో కలిసి అల్లు అర్జున్ నడిచారు. అక్కడ ఉన్న భారీ జనాలకు అల్లు అర్జున్ అభివాదం చేస్తూ ముందుకు సాగారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది.

వాఘా సరిహద్దు వద్ద మన అల్లు అర్జున్ కు దక్కిన గౌరవంకు పుష్ప సినిమాతో వచ్చిన సూపర్ హిట్ అంటూ చర్చ జరుగుతోంది. అల్లు అర్జున్ పుష్ప సినిమా అక్కడ ఇక్కడ అనే తేడా లేకుండా దేశ వ్యాప్తంగా భారీ ఎత్తున వసూళ్లు దక్కించుకుని సంచలన విజయాన్ని నమోదు చేసిన విషయం తెల్సిందే.

ఇండియా పాకిస్తాన్ బోర్డర్ లో ఆయనకు దక్కిన స్వాగతం ను చూస్తే పుష్ప సినిమా ఏ స్థాయికి బన్నీని తీసుకు వెళ్లిందో అర్థం చేసుకోవచ్చు.

వాఘా సరిహద్దు వద్ద బన్నీ తన కుటుంబ సభ్యులతో కలిసి అక్కడి ఉన్నతాధికారులతో ఫోటోలు దిగాడు. ఆ ఫోటోలు మరియు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.