ఆ బాధ్యత పూర్తి చేసిన అల్లు అరవింద్

Mon Oct 14 2019 11:31:37 GMT+0530 (IST)

టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ల జాబితాలో టాప్ లో నిలిచే వ్యక్తి అల్లు అరవింద్.  మొదటి నుంచి ఆయన బ్యానర్ లో తెరకెక్కే సినిమాలకు విజయాల శాతం ఎక్కువ.  ఇండస్ట్రీలోకి కొత్త నిర్మాతలు ఎందరు వచ్చినా అరవింద్ గారు మాత్రం ఇప్పటికీ తన ట్రాక్ రికార్డును అలాగే కొనసాగిస్తూ ఉన్నారు.  రీసెంట్ గా అరవింద్ గారు తన 70 వ పుట్టినరోజును జరుపుకున్నారు.  పుట్టిన రోజు సందర్భంగా ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నారట.అల్లు అరవింద్ తన ముగ్గురు కుమారులు అల్లు వెంకటేష్.. అల్లు అర్జున్.. అల్లు శిరీష్ లకు ఆస్తిపంపకాలు చేశారని..  తన ఆస్తులను ముగ్గురికీ సమానంగా పంచారని సమాచారం.  నిజానికి గత కొంతకాలంగా అల్లు అరవింద్ ఫ్యామిలీలో కొన్ని మార్పులు జరిగాయి. గీతా ఆర్ట్స్ బ్యానర్ ఉన్నప్పటికీ అల్లు అర్జున్ మరో బ్యానర్ స్థాపించారు. కొత్త ఆఫీస్ కూడా తీసుకున్నారు. అదే కాకుండా రీసెంట్ గా అల్లు అర్జున్ తన సొంత ఇంటి నిర్మాణానికి భూమి పూజ కూడా జరిపారు. అల్లు కుటుంబం అంతా మొదటి నుంచి ఉమ్మడిగానే ఉంటారు. దీంతో అల్లు అర్జున్ కొత్త ఇంట్లోకి మారుతున్నాడనే విషయం కన్ఫాం అయింది.

శిరీష్ కు నటనపై ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఇకపై గీతా ఆర్ట్స్ వ్యవహారాలను అల్లు వెంకటేష్ చూసుకుంటారని సమాచారం. అల్లు అర్జున్ కు సొంత బ్యానర్ ఉంది కాబట్టి గీతా ఆర్ట్స్ బిజినెస్ వ్యవహారాలకు దూరంగా ఉంటారట.  ఇక అరవింద్ గారు మాత్రం పంపకాలు అన్నీ చేశారు.. బాధ్యతలు అప్పగించారు కాబట్టి భవిష్యత్తులో ప్రశాంతంగా గడుపుదామని అనుకుంటున్నారట.