అల్లు స్టూడియోస్ ప్రారంభోత్సవ అతిథి ఎవరో తెలుసా?

Thu Sep 29 2022 22:00:01 GMT+0530 (India Standard Time)

Allu studio movie news

గత సంవత్సరం అక్టోబర్ 1న దివంగత తెలుగు నటుడు అల్లు రామలింగయ్య 99వ జయంతి సందర్భంగా ఆయన వారసుడు అల్లు అరవింద్ నేతృత్వంలోని కుటుంబ సభ్యులు హైదరాబాద్ లో అల్లు స్టూడియోస్ (నయా ట్రెండీ స్టూడియో)ను ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. ప్రకటన రోజున ఆయన కుమారుడు అల్లు అరవింద్- మనవళ్లు అల్లు అర్జున్- బాబీ అల్లు- అల్లు శిరీష్ హైదరాబాద్ లో ఫిల్మ్ స్టూడియో లాంచింగ్ వేడుకల్లో పాల్గొన్నారు. గండిపేట్ లో 10 ఎకరాల్లో విస్తరించి ఉన్న అల్లు స్టూడియోస్ నిర్మాణ పనులు అదే రోజున ప్రారంభం అయ్యాయి.ఇటీవలే అల్లు స్టూడియోస్ నిర్మాణం పూర్తయింది. స్టూడియో ఇప్పుడు జీవనోపాధిని అందించడానికి సిద్ధంగా ఉంది. అల్లు స్టూడియోస్ లో చిత్రీకరణ  పనులకు సంబందించిన బిల్డింగ్స్ అందుబాటులో ఉన్నాయి. అల్లు ఫ్యామిలీ ఇచ్చిన మాట ప్రకారం లెజెండరి నటులు  దివంగత అల్లు రామలింగయ్య గారి 100వ జయంతి సందర్భంగా స్టూడియోస్ ను గ్రాండ్ గా ప్రారంభించనున్నారు.

తాజా సమాచారం మేరకు.. అల్లు స్టూడియోస్ ను ప్రారంభించే గ్రాండ్ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. నిర్మాత.. స్టూడియో అధినేత అల్లు అరవింద్ - ఐకాన్ స్టార్ అల్లు అర్జున్- అల్లు శిరీష్- అల్లు వెంకటేష్ ఇతర అల్లు కుటుంబం సమక్షంలో ఈ స్టూడియోలను మెగాస్టార్ చిరంజీవి ప్రారంభించనున్నారు.

ఇప్పుడు హైదరాబాద్ లోని  సినిమా షూటింగులకి అల్లు స్టూడియో కేరాఫ్ అడ్రెస్ గా మారనుంది. అల్లు స్టూడియోస్ గ్రాండ్ ఓపెనింగ్ చూసేందుకు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

హైదరాబాద్ లో అక్కినేని కుటుంబానికి అన్న పూర్ణ స్టూడియోస్... దగ్గుబాటి కుటుంబానికి రామానాయుడు స్టూడియోస్... నందమూరి కుటుంబానికి రామకృష్ణ సినీ స్టూడియోస్ (నాచారం) ఉన్నాయి. మెగా ఫ్యామిలీ అల్లు ఫ్యామిలీస్ కి సినిమా స్టూడియోస్ లేవు.

ఇప్పుడు ఆ లోటును భర్తీ చేస్తూ అల్లు కుటుంబం ఒకడుగు ముందుకు వేసింది. హైదరాబాద్ లో అల్లు స్టూడియోస్ ని లాంచ్ చేస్తోంది. మెగాస్టార్ చిరంజీవి కూడా తనకు ఎంతో ఇష్టమైన ఆహ్లాదకరమైన బీచ్ సొగసుల విశాఖ నగరం ఔటర్ లో ఫిలింస్టూడియోని నిర్మించేందుకు ఆసక్తిగా ఉన్నారని ప్రచారమైంది. కానీ దానికి పునాది రాయి పడకపోవడం ఆశ్చర్యపరిచింది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.