ఫోటో స్టోరీ: మల్లూ బ్యూటీతో ప్రేమ మైకంలో మునిగి తేలుతున్న అల్లు హీరో..!

Thu Oct 06 2022 13:13:20 GMT+0530 (India Standard Time)

Photo story: Allu hero is in love with Mallu beauty..!

యంగ్ హీరో అల్లు శిరీష్ మరియు గార్జియస్ బ్యూటీ అనూ ఇమ్మాన్యుయేల్ జంటగా నటించిన తాజా చిత్రం "ఉర్వశివో రాక్షసివో". 'విజేత' ఫేమ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. రిలీజ్ కు రెడీ అవుతున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు మేకర్స్.నేటి యువతరం భావాలకు అద్దంపట్టే కథాంశంతో న్యూ ఏజ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా 'ఊర్వశివో రాక్షశివో' చిత్రాన్ని తెరకెక్కించారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు ఆకట్టుకున్నాయి. ఇటీవల వచ్చిన టీజర్ కు ఆడియన్స్ నుంచి అనూహ్య స్పందన లభించింది.

ప్రమోషన్స్ లో భాగంగా ఇప్పుడు ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తున్నారు. అక్టోబర్ 10న 'ఊర్వశివో రాక్షసివో' చిత్రం నుండి "దీంతననా" అనే పాటను విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

ఈ సందర్భంగా మేకర్స్ వదిలిన బ్యూటీఫుల్ పోస్టర్ ఆకట్టుకుంటోంది. ఇందులో అల్లు శిరీష్ మరియు అను ఇమ్మాన్యూల్ జంట రొమాంటిక్ మూడ్ లో ఉన్నారు. కారులో ఒకరికొకరు దగ్గరగా కూర్చొని ప్రేమ మైకంలో మునిగి తేలుతున్నట్లు కనిపిస్తున్నారు.

మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ మరియు శ్రీ తిరుమల ప్రొడక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్స్ పై ధీరజ్ మొగిలినేని ఈ చిత్రాన్ని నిర్మించారు. విజయ్ ఎం సహ నిర్మాతగా వ్యవహారించారు. అనూప్ రూబెన్స్ & అచ్చు రాజమణి ఈ సినిమాకి సంగీతం సమకూర్చారు. తన్వీర్ మిర్ సినిమాటోగ్రఫీ అందించగా.. కార్తీక్ శ్రీనివాస్ ఎడిటింగ్ వర్క్ చేశారు. దీనికి బాబు ఆర్ట్ డైరెక్టర్.

'భలే భలే మగాడివోయ్' 'గీత గోవిందం' 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్' లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలను నిర్మించిన GA2 పిక్చర్స్ బ్యానర్ లో రాబోతున్న "ఊర్వశివో రాక్షసివో" సినిమాపై అందరిలో ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో ఉంది.

'ఊర్వశివో రాక్షసివో' చిత్రాన్ని 2022 నవంబర్ 4వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇటీవలే అధికారికంగా ప్రకటించారు. 'ఎబిసిడి' సినిమా తర్వాత కాస్త గ్యాప్ తీసుకుని వస్తున్న అల్లు శిరీష్.. ఈసారి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.