బన్నీ నుండి షాకింగ్ ప్రకటన ఏమైన రానుందా..?

Thu Jun 30 2022 21:19:01 GMT+0530 (India Standard Time)

Allu arjun movie news

గత ఏడాది చివర్లో పుష్ప సినిమా తో వచ్చిన అల్లు అర్జున్ ఆ సినిమా తో పాన్ ఇండియా రేంజ్ లో సూపర్ హిట్ ను దక్కించుకున్నాడు. ఇంకా కూడా పుష్ప సినిమా మానియా కంటిన్యూ అవుతూనే ఉంది. పుష్ప హుక్ స్టెప్స్ ఇంకా డైలాగ్స్ సన్నివేశాలు.. ప్రతి ఒక్కటి కూడా నార్త్ నుండి సౌత్ వరకు... ఈస్ట్ నుండి వెస్ట్ వరకు కూడా ట్రెండ్ అవుతూనే ఉన్నాయి.పుష్ప పాటలు మరియు డైలాగ్ అంతర్జాతీయ స్థాయిలో ట్రెండ్ అయిన నేపథ్యంలో పుష్ప 2 ను అంతకు మించి ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ముందుగా అనుకున్న ప్రకారం ఈ ఏడాది ఫిబ్రవరిలోనే షూటింగ్ ను మొదలు పెట్టాలి.. జూలై లేదా ఆగస్టు వరకు షూటింగ్ ను ముగించాల్సి ఉంది. కాని ఇప్పటి వరకు స్క్రిప్ట్ వర్క్ ను ముగించలేదు.

షూటింగ్ కు ఇంకాస్త సమయం పట్టే అవకాశం ఉంది అంటూ బన్నీ సన్నిహితుల నుండి సమాచారం అందుతోంది. మరో వైపు సుకుమార్ పుష్ప 2 స్క్రిప్ట్ ను రెడీ చేశాడు.. కేజీఎఫ్ 2 ను మించిన యాక్షన్ సన్నివేశాలతో పాటు అద్బుతమైన హీరోయిజం ఎలివేట్ అయ్యే సన్నివేశాలు ఉండబోతున్నాయి అంటున్నారు. మొత్తానికి పుష్ప 2 గురించి గందరగోళం అయితే నడుస్తోంది.

ఈ సమయంలో మీడియా సర్కిల్స్ లో ఒక విషయం తెగ చక్కర్లు కొడుతోంది. అదేంటీ అంటే పుష్ప 2 సినిమా కంటే ముందు అల్లు అర్జున్ మరో సినిమా ను చేసే అవకాశాలు ఉన్నాయి.. ఆ సినిమా గురించిన ప్రకటన అతి త్వరలోనే రాబోతుంది. ఆ ప్రకటన బన్నీ ఫ్యాన్స్ తో పాటు ప్రతి ఒక్కరికి కూడా షాకింగ్ గా ఉంటుంది అంటూ ఆ పుకార్ల సారాంశం.

బన్నీ పుష్ప 2 కు ముందు మరో సినిమా చేసే ఉద్దేశ్యంతో ఉంటే ఇప్పటికే ఆ సినిమా ను మొదలు పెట్టేవాడు. కాని పుష్ప తర్వాత పుష్ప 2 తో వస్తేనే బాగుంటుందనే ఉద్దేశంతో మరే కథ కు కూడా ఓకే చెప్పలేదు.. ఏది చేసినా కూడా పుష్ప 2 తర్వాతే అన్నట్లుగా బన్నీ వెయిట్ చేస్తున్నాడని.. పుష్ప 2 స్క్రిప్ట్ వర్క్ ముగింపు దశకు చేరుకున్నాయి.. ఈ ఏడాది చివరి వరకు పుష్ప 2 షూటింగ్ మొదలు అవుతుందని బన్నీ అభిమానులు నమ్మకంగా ఉన్నారు. మరి బన్నీ నుండి నిజంగానే ఆ షాకింగ్ ప్రకటన వస్తుందా అనేది చూడాలి.