సోషల్ మీడియాలో అరుదైన ఫీట్ సాధించిన అల్లు అర్జున్ సతీమణి..!

Thu Jun 17 2021 16:00:01 GMT+0530 (IST)

Allu Sneha achieves rare feat on social media

టాలీవుడ్ స్టార్ హీరోలకు ఎంత క్రేజ్ ఉందో.. వారి భార్యామణులకు కూడా అంతే క్రేజ్ ఉంది. సోషల్ మీడియాలో తమ భర్తలకు పోటీగా ఎప్పటికప్పుడు పోస్టులు పెడుతూ సందడి చేస్తుంటారు. తమ పిల్లల గురించి.. భర్త నటించే సినిమాల గురించి పోస్టులు పెడుతూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు. వారిలో కొందరు ఫిలిం బ్యాగ్రౌండ్ ఉన్న స్టార్ వైవ్స్ అయితే.. మరికొందరు సినీ నేపథ్యం లేని వారు ఉన్నారు. అలాంటి వారిలో అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి ఒకరు.స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ని ప్రేమ వివాహం చేసుకుంది స్నేహా రెడ్డి. అల్లు ఫ్యామిలీకి కోడలిగా అడుగుపెట్టిన స్నేహ.. ఇప్పుడు తన భర్త మరియు ఇద్దరు పిల్లలతో హాయిగా ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తోంది. ఇక సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే ఆమె.. భారీ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఎప్పటికప్పుడు తన పిల్లలు చేసే అల్లరి వీడియోలు షేర్ చేస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు కొత్త కొత్త ట్రెండీ లుక్స్ లో ఉండే తన ఫోటోలను కూడా పంచుకుంటూ ఉంటారు.

అల్లు స్నేహా రెడ్డి తాజాగా ఇన్స్టాగ్రామ్ లో 4 మిలియన్ల ఫాలోవర్స్ మార్క్ ని అందుకున్నారు. ఈ క్రమంలో పాన్ ఇండియా స్థాయిలో సినీ నేపథ్యం లేని స్టార్ వైవ్స్ లో అత్యధిక ఫాలోవర్స్ కలిగిన వ్యక్తిగా నిలిచారు. హీరోయిన్లకు ధీటుగా క్రేజ్ ఉన్న ఆమె.. ఇప్పుడు సోషల్ మీడియా ఫాలోయింగ్ లో కూడా వారికి పోటీనిస్తోంది. నిజానికి చాలా మంది హీరోయిన్లకు కూడా అంతమంది ఫాలోవర్స్ లేరనే చెప్పాలి.