స్టైలిష్ స్టార్ వైఫా మజాకానా?

Mon Aug 15 2022 10:21:53 GMT+0530 (IST)

Allu Sneha Reddy Stylish Looks

సూపర్ మోడల్ కి అయినా మతి చెడేలా! అదిరే ఫ్యాషన్ తో అలరించారు స్నేహారెడ్డి. స్టైలిష్ స్టార్ వైఫా మజాకానా? అనేంతగా ఎంతో స్టైలిష్ లుక్ తో కనిపించారు. ఆ షేడెడ్ కలర్ చీరకు కాంబినేషన్ డిజైనర్ బ్లౌజ్.. చెవికి క్రిస్టలైన్ జూకా ధరించి అల్లు స్నేహ ఎంతో ఇస్మార్ట్ గా కనిపిస్తున్నరు. ఇంకా చెప్పాలంటే సూపర్ మోడల్ ని తలపిస్తున్నారు.ఇటీవల సోషల్ మీడియాల్లో స్నేహా ఎంతో యాక్టివ్ గా ఉన్నారు. నిరంతరం తమ కుటుంబ వేడుకల ఫోటోలు వీడియోతో పాటు వ్యక్తిగత ఫోటోషూట్లను కూడా షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. స్నేహా అర్జున్ తాజా ఫోటోషూట్ నుండి కొన్ని ఫోటోలను షేర్ ఏయగా అవి వైరల్ గా మారాయి.

వీటిలో సూపర్ మోడల్ లాగా మనోహరంగా కనిపిస్తోందంటూ అభిమానులు కాంప్లిమెంట్లు ఇచ్చేస్తున్నారు. సమంతకు ఎంతో ఇష్టమైన స్టైలిస్ట్ ప్రీతమ్ జుకల్కర్ ఈ లుక్ ని డిజైన్ చేసారు. శాటిన్ చీర - చేతితో ఎంబ్రాయిడరీ చేసిన స్లీవ్ లెస్ బ్లౌజ్ స్నేహా కోసం ఎంతో ఒద్దికగా రూపొందించిన తీరు ఆకట్టుకుంది.

ఇంతకీ ఆ భుజంపై పాకి ఉన్న ఆ నక్షత్ర చేప టెంటకిల్స్ డిజైన్ ఆలోచన ఎలా వచ్చిందో కానీ ప్రీతమ్ కి హ్యాట్సాఫ్ చెప్పాలి. అది ప్రత్యేక ఆకర్షణను తెచ్చింది. ఈ ఫోటోలను షేర్ చేయగానే అభిమానులు ఆమెను 'స్టైలిష్ స్టార్ రాణి' అని పిలుస్తున్నారు. ఇన్ స్టాగ్రామ్ లో స్నేహను 80 లక్షల (8 మిలియన్ల మంది) అభిమానులు అనుసరిస్తున్నారు. అందరికీ ఈ ఫోటోగ్రాఫ్ షేర్ అయ్యింది. వారంతా ఈ లుక్ కి ఫిదా అయిపోయారు.

బాలీవుడ్ లో మీరా రాజ్ పుత్.. టాలీవుడ్ లో స్నేహారెడ్డి అంటూ ఫ్యాన్స్ ప్రతిసారీ కాంప్లిమెంట్లు ఇస్తూనే ఉన్నారు. షాహిద్ కపూర్ - మీరా రాజ్‌పుత్ జంట అన్యోన్యత లానే అల్లు అర్జున్ - స్నేహా అన్యోన్యత పైనా ప్రతిసారీ అభిమానులు ప్రశంసలు కురిపిస్తుంటారు.

బన్నీ కూడా  స్నేహ కలిసి కొన్ని టీవీ వాణిజ్య ప్రకటనలు చేయాలని కూడా ఫ్యాన్స్ కోరుతున్నారు. రియల్ లైఫ్ లో వైఫ్ అయినట్టే స్నేహారెడ్డి ఏదైనా డీసెంట్ రోల్ ని బన్నీతో కలిసి పెద్ద తెరపైనా పోషిస్తే చూడాలనుందని కూడా అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.