బర్త్ డే పార్టీ తర్వాత అర్హతో స్నేహారెడ్డి ట్రిప్ ఎక్కడికి?

Tue Sep 29 2020 23:15:43 GMT+0530 (IST)

Where is Sneha Reddy's trip worthy of after the birthday party?

కొద్ది మంది సన్నిహితులతో కలిసి తన పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న తరువాత అల్లు అర్జున్ భార్య స్నేహ కుటుంబంతో గడపడానికి ఒక చిన్నపాటి విహారయాత్రకు వెళ్లారని తెలుస్తోంది. ఇంతకుముందు కేక్ కట్ చేస్తూ భార్య స్నేహతో కలిసి బన్ని ఎంతో ఆనందంగా ఉన్న ఫోటోలు అంతర్జాలంలో వైరల్ అయ్యాయి. తాజాగా అల్లు అర్జున్ భార్య స్నేహ హైదరాబాద్ విమానాశ్రయంలో తమ కుమార్తె బేబి అర్హాతో కలిసి కనిపించారు.ప్రస్తుతం ఈ స్పెషల్ ఫోటో అంతర్జాలంలో వైరల్ గా మారింది. బన్ని విమానాశ్రయంలో కనిపించకపోయినా.. స్నేహా తన కుమార్తె అర్హా మరి కొద్దిమంది పిల్లలతో కలిసి త్వరత్వరగా వెళుతున్న దృశ్యం కనిపించింది. స్నేహ బేసిక్ డెనిమ్ వైట్ టీ స్ లో ఎప్పటిలాగే ఎంతో అందంగా కనిపించారు. అర్హా పింక్ టాప్ .. డెనిమ్ ఫ్లోరల్ జాకెట్ లో బుట్టబొమ్మనే తలపిస్తోంది. మామ్ డాటర్ జోడీ విమానాశ్రయం లోపలికి వెళుతున్నప్పుడు ఎంతో స్టైలిష్ గా కనిపించారు. ఇక బేబి అర్హ ప్రత్యేకించి గ్లాస్ మాస్క్ ని ధరించి కనిపించింది.

గత రాత్రి పుట్టినరోజు పార్టీ నుండి ఒక అందమైన ఫోటోను పంచుకుంటూ బన్నీ ఆసక్తికర వ్యాఖ్యను జోడించారు. ``నా జీవితంలో అత్యంత ప్రత్యేకమైన వ్యక్తికి చాలా సంతోషకరమైన రాబడి. మీతో ఎక్కువ పుట్టినరోజులు గడపాలని కోరుకుంటున్నాను. పుట్టినరోజు శుభాకాంక్షలు అందమైన పడుచుపిల్ల ... #allusnehareddy`` అంటూ ఇన్ స్టాలో వ్యాఖ్యానించారు.