Begin typing your search above and press return to search.

ఆఫీస్ స్టాఫ్ తో క్యారమ్స్ ఆడుతున్న అల్లు వారబ్బాయి..!

By:  Tupaki Desk   |   19 Jun 2021 6:30 AM GMT
ఆఫీస్ స్టాఫ్ తో క్యారమ్స్ ఆడుతున్న అల్లు వారబ్బాయి..!
X
యంగ్ హీరో అల్లు శిరీష్ సోషల్ మీడియాలో బాగా యాక్టీవ్ గా ఉంటారు. సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ తోపాటుగా పర్సనల్ విషయాలను కూడా షేర్ చేస్తూ అభిమానులను ఉత్సాహపరుస్తుంటాడు. ఈ క్రమంలో తాజాగా తన ఆఫీస్ స్టాఫ్ తో కలిసి క్యారమ్స్ ఆడుతున్న ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అందరి హృదయాలను గెలుచుకున్నాడు.

అల్లు శిరీష్ ప్రతి రోజు తన వర్క్ కంప్లీట్ అయిన తర్వాత ఏమి చేస్తాడనే విషయాన్ని శుక్రవారం ఇన్స్టాగ్రామ్ స్టోరీ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. తన ఆఫీస్ సిబ్బందితో కలిసి క్యారమ్ బోర్డ్ ఆడుతున్న ఫోటోని శిరీష్ షేర్ చేశారు. "పనులు పూర్తయిన తర్వాత నా ఆఫీస్ లో నేను ఇదే చేస్తాను" అని దీనికి క్యాప్సన్ పెట్టాడు. 'ఇది బెస్ట్ మల్టీప్లేయర్ గేమ్' అని రాసుకొచ్చాడు.

ఇకపోతే అల్లు శిరీష్ ఇటీవలే ''ప్రేమ కాదంట'' అనే తన 6వ చిత్రాన్ని ప్రకటించారు. రాకేష్ శశి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అను ఇమ్మాన్యుయేల్‌ హీరోయిన్ గా నటిస్తోంది. ఇది లవ్ అండ్ లివింగ్ రిలేష‌న్ షిప్ నేప‌థ్యంలో రూపొందే న్యూ ఏజ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది. ఇందులో శిరీష్ సిక్స్ ప్యాక్ బాడీతో కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన రొమాంటిక్ ప్రీ లుక్ పోస్టర్స్ - ఫస్ట్ లుక్ మంచి స్పందన తెచ్చుకున్నాయి. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్ పై బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.