Begin typing your search above and press return to search.

అల్లు అరవింద్ అల్లుడు కూడా హీరోగా వచ్చేస్తున్నాడు..!

By:  Tupaki Desk   |   4 March 2021 6:30 AM GMT
అల్లు అరవింద్ అల్లుడు కూడా హీరోగా వచ్చేస్తున్నాడు..!
X
ప్రస్తుతం తెలుగు చిత్ర సీమ‌లో మిగతా ఫ్యామిలీ హీరోలకంటే మెగా కాంపౌండ్ హీరోల హవా కాస్త ఎక్కువగా ఉంటుందనేది వాస్తవం. స్వయంకృషితో మెగాస్టార్ స్థాయికి ఎదిగిన చిరంజీవి సపోర్ట్ తో ఇప్పటి వరకు సుమారు డజను మంది ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. చిరంజీవి - నాగబాబు - పవన్ కళ్యాణ్ - రామ్ చరణ్ - అల్లు అర్జున్ - అల్లు శిరీష్ - వరుణ్ తేజ్ - సాయి తేజ్ - వైష్ణవ్ తేజ్ - కళ్యాణ్ దేవ్ - నిహారిక.. ఇలా అందరూ మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన వారే. ఈ క్రమంలో ఇప్పుడు మ‌రో కొత్త హీరో మెగా కాంపౌండ్ నుంచి ఇండ‌స్ట్రీలోకి అడుగుపెడుతున్నాడు. మెగా ప్రొడ్యూసర్ అల్లు అర‌వింద్ బావ‌మ‌రిది కొడుకు ముత్తంశెట్టి విరాన్ హీరోగా లాంఛ్ అవుతున్నాడు.

'బ‌తుకు బస్టాండ్' అనే సినిమాతో విరాన్ తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు. ఇప్పటికే ముత్తంశెట్టి వారు బన్నీ నటిస్తున్న 'పుష్ప' ప్రొడక్షన్ లో భాగస్వాములుగా ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో నిన్న బుధవారం 'బ‌తుకు బస్టాండ్' ఫస్ట్ లుక్ ని వదలడమే చేయడమే కాకుండా జూన్ 11న సినిమాని రిలీజ్ చేస్తున్నామని ప్రకటించారు. అల్లు అర్జున్ మామ కొడుకు విరాన్ తో కలిపి మొత్తం మెగా కాంపౌండ్ నటీనటుల సంఖ్య 12కు చేరుకుంది. అయితే ఈ కాంపౌండ్ నుంచి వ‌చ్చిన ప్ర‌తీ హీరో ఏదో రకంగా సినిమాలు చేస్తే జ‌నాల మ‌ధ్య హైప్ తెచ్చుకుంటున్నారు. మ‌రి విరాన్ ప్లానింగ్ ఎలా ఉంటుందో చూడాలి. ఇకపోతే నిహారిక భ‌ర్త చైత‌న్య కూడా హీరోగా లాంఛ్ అవుతాడనే ఊహాగానాలు ఈ మధ్య వినిపిస్తున్నాయి. అదే సమయంలో చైతన్య కు సినిమాలపై పెద్దగా ఆసక్తి లేదని కూడా అంటున్నారు. మరి రాబోయే రోజుల్లో మెగా ఫ్యామిలీ నుంచి ఎంతమంది ఇండస్ట్రీకి పరిచయం అవుతారో చూడాలి.