Begin typing your search above and press return to search.

వీడియో : బన్నీ తనయుడు మరి ఆమాత్రం చేయడా?

By:  Tupaki Desk   |   14 Oct 2020 3:00 PM GMT
వీడియో : బన్నీ తనయుడు మరి ఆమాత్రం చేయడా?
X
టాలీవుడ్‌ యంగ్‌ స్టార్‌ హీరోల్లో బాగా డాన్స్‌ చేసేది ఎవరు అంటే ఠక్కున వినిపించే పేర్లలో ముందు వరుసలో అల్లు అర్జున్‌ పేరు ఉంటుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అల్లు అర్జున్‌ డాన్స్‌ లతో ఇరగదీస్తూ ఉంటాడు. తన ప్రతి సినిమాలో కూడా ఏదో ఒక సిగ్నేచర్‌ స్టెప్‌ ను వేస్తూ అందరిని ఆకట్టుకుంటూ ఉంటాడు. స్టైలిష్‌ స్టార్‌ గా గుర్తింపు దక్కించుకున్న బన్నీ హీరోగా ఎంట్రీ ఇవ్వక ముందే డాడీ సినిమాలో ఒక డాన్సర్‌ పాత్రలో కనిపించిన విషయం తెల్సిందే. అలాంటి బన్నీ తనయుడు అంటే డాన్స్‌ విషయంలో ఎలా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

ఈ వయసు నుండే అల్లు అర్జున్‌ తనయుడు అల్లు అయాన్‌ డాన్స్‌ పై పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తున్నాడు. టీవీ ముందు ఏ పాట వచ్చినా కూడా డాన్స్‌ చేసేందుకు అయాన్‌ ప్రయత్నిస్తూ ఉంటాడట. నేడు అల్లు అయాన్‌ వీడియోను బన్నీ దంపతులు షేర్‌ చేశారు. అందులో అయాన్‌ టీవీ ముందు నిల్చుని అందులో వచ్చే పాటకు రిథమిక్‌ గా డాన్స్‌ చేసేందుకు ప్రయత్నించాడు. మెల్లగా తండ్రిలా డాన్స్‌ లో పెర్ఫెక్ట్‌ అయ్యేందుకు గాను అయాన్‌ ప్రయత్నాలు చేస్తున్నట్లుగా అనిపిస్తుంది అంటూ నెటిజన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు. అయాన్‌ డాన్స్‌ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతోంది. మీరు ఒక లుక్కేయండి.