అల్లు అరవింద్ 'బ్రాకెట్' ఫిక్స్ చేశాడు

Fri Sep 24 2021 11:08:20 GMT+0530 (IST)

Allu Arvind has registered the title Bracket

ప్రముఖ నిర్మాత ఈమద్య కాలంలో ఆచితూచి సినిమాలను నిర్మిస్తున్నారు. పెద్ద సినిమాలతో పాటు చిన్న సినిమాలను కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాలను కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు గాను కొత్త వారిని ప్రోత్సహిస్తూ వస్తున్నాడు. తాజాగా మలయాళంలో సూపర్ హిట్ అయిన నయట్టు సినిమాను రీమేక్ చేసేందుకు గాను హక్కులు కొనుగోలు చేయడం జరిగింది. హీరో హీరోయిన్ లు ఉండి రెగ్యులర్ కమర్షియల్ సినిమా లా కాకుండా ఇదో విభిన్నమైన కాన్సెప్ట్ తో సాగే సినిమా. మలయాళంలో మంచి టాక్ ను దక్కించుకున్న నయట్టు సినిమా ను మంచి కాస్టింగ్ తో తెలుగు లో రీమేక్ చేసేందుకు సిద్దం అయిన అల్లు అరవింద్ ఈ రీమేక్ కు గాను 'బ్రాకెట్' అనే టైటిల్ ను రిజిస్ట్రర్ చేయించారు. టైటిల్ తో సినిమా కాన్సెప్ట్ రివీల్ అయ్యేలా కాకుండా సినిమాపై మరింత ఆసక్తి కలిగేలా అల్లు అరవింద్ బ్రాకెట్ ను ఖరారు చేయడం జరిగింది.బ్రాకెట్ అనే టైటిల్ ను రిజిస్ట్రర్ చేయడంతో పాటు షూటింగ్ కు కూడా చకచక ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను నవంబర్ లో ప్రారంభించబోతున్నారు. కేవలం రెండు మూడు నెలల్లోనే షూటింగ్ ను పూర్తి చేస్తారనే వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా ను థియేటర్ల ద్వారా విడుదల చేస్తారట. పలాస మరియు శ్రీదేవి సోడా సెంటర్ వంటి విభిన్న చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు కరుణ కుమార్ ఈ రీమేక్ కు దర్శకత్వం వహించబోతున్న విషయం తెల్సిందే. ఈ సినిమాలో అంజలి.. రావు రమేష్ మరియు సత్య దేవ్ లు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.

మలయాళ వర్షన్ కు పలు మార్పులు చేర్పులు చేసి కాస్త కమర్షియల్ టక్ ఇచ్చి తెలుగు లో రీమేక్ చేసేందుకు సిద్దం అయ్యారు. వరుసగా తెలుగు లో వస్తున్న రీమేక్స్ కు మరియు కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలకు మంచి ఆధరణ దక్కుతుంది. అందుకే బ్రాకెట్ కు కూడా జనాల నుండి మంచి ఆధరణ లభిస్తుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది. అల్లు అరవింద్ అభిరుచి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన మంచి కాన్సెప్ట్ అయితేనే నిర్మించేందుకు ముందుకు వస్తాడు. సినిమాల నిర్మాణం విషయంలో ఆయన చాలా క్లారిటీగా ఉంటారు. ఆయన సక్సెస్ రేటు చాలా ఎక్కువ. అందుకే ఈ సినిమా కూడా తప్పకుండా తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా ఉంటుందని.. దర్శకుడు కరుణ కుమార్ మరో సక్సెస్ ను దక్కించుకుంటాడనే నమ్మకంను ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు.