Begin typing your search above and press return to search.

అల్లు అర్జున్‌ పైప్స్ అండ్ ఫిట్టింగ్స్‌..!

By:  Tupaki Desk   |   28 May 2022 9:30 AM GMT
అల్లు అర్జున్‌ పైప్స్ అండ్ ఫిట్టింగ్స్‌..!
X
అల్లు అర్జున్‌ పుష్ప సినిమా తో పాన్ ఇండియా స్టార్‌ హీరోగా మారి పోయాడు. పుష్ప 2 కోసం ప్రస్తుతం రెడీ అవుతున్న అల్లు అర్జున్ మరో వైపు వరుసగా పలు బ్రాండ్స్ కు తన ఇమేజ్ ను జోడించి ప్రమోట్ చేసేందుకు ముందుకు వస్తున్నాడు. ప్రముఖ కూల్‌ డ్రింక్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న అల్లు అర్జున్ ఒక ప్రముఖ విద్యా సంస్థకు కూడా బ్రాండ్‌ అంబాసిడర్ గా వ్యవహరించాడు.

ఇటీవలే జొమాటొ మరియు ఇంకా రెండు మూడు సంస్థలకు కూడా బ్రాండ్‌ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న విషయం అందరికి తెల్సిందే. సినిమాలతో బిజీగా ఉన్నా అదనపు ఆదాయం కోసం చాలా మంది హీరోలు బ్రాండ్‌ అంబాసిడర్స్ గా వ్యవహరిస్తున్నారు. తెలుగు హీరోల్లో అత్యధిక బ్రాండ్స్ కు అంబాసిడర్ గా వ్యవహరించే హీరోగా మహేష్‌ బాబు నిలిచాడు. ఆ తర్వాత బన్నీ అనడంలో సందేహం లేదు.

ఆయన తాజాగా ఆస్ట్రల్ లిమిటెడ్ అనే గృహోపకరణాల తయారి మరియు పైప్స్ అండ్‌ ఫిట్టింగ్స్ కు సంబంధించిన ఉత్పత్తులకు ప్రమోటర్ గా వ్యవహరించబోతున్నాడు. ఉత్తరాదిన బాలీవుడ్ స్టార్‌ హీరో రణ్వీర్‌ సింగ్ ఆస్ట్రల్ లిమిటెడ్ కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నాడు.

ఇప్పుడు సౌత్‌ లో ఆ కంపెనీకి అల్లు అర్జున్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌ గా వ్యవహరించేందుకు గాను దాదాపుగా ఓకే చెప్పాడని తెలుస్తోంది.

హిందీ స్టార్‌ హీరో రణ్వీర్‌ సింగ్ ప్రమోట్‌ చేసిన చాలా ఉత్పత్తులను అల్లు అర్జున్‌ ప్రమోట్‌ చేస్తున్న విషయం తెల్సిందే. ఇప్పుడు ఆయన చేస్తున్న ఆస్ట్రల్ లిమిటెడ్ కంపెనీ ప్రమోషన్ ను కూడా బన్నీ బాధ్యతలు తీసుకున్నాడు. ఇందుకు గాను అల్లు అర్జున్‌ భారీ మొత్తంలో పారితోషికం అందుకుంటున్నాడనే వార్తలు కూడా వస్తున్నాయి.

అల్లు అర్జున్‌ పుష్ప సినిమా తో భారీ వసూళ్లు రాబట్టడంతో ఆయన తదుపరి సినిమా పుష్ప 2 కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆ తర్వాత బన్నీ చేయబోతున్న సినిమా లు ఏంటా అంటూ అంతా ఆసక్తిగా ఉన్నారు. పుష్ప 2 సినిమా షూటింగ్ ప్రారంభించాల్సి ఉన్నా కూడా కొన్ని కారణాల వల్ల వాయిదాలు వేస్తూ వచ్చారు. అతి త్వరలోనే పుష్ప 2 ను పట్టాలెక్కించబోతున్నట్లుగా ఇటీవలే సుకుమార్‌ పేర్కొన్నాడు.