Begin typing your search above and press return to search.

చిరంజీవి కన్నా అల్లు అర్జునే టాప్!

By:  Tupaki Desk   |   29 Jan 2023 5:53 PM GMT
చిరంజీవి కన్నా అల్లు అర్జునే టాప్!
X
సౌత్ ఇండస్ట్రీలో సంక్రాంతి పెద్ద పండగ కావడంతో ఈ సీజన్ లో సినిమాలు కూడా ఎక్కువుగా రిలీజ్ అవుతూ ఉంటాయి. ఒక సినిమాతో మరో చిత్రం పోటీ పడుతూ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ ను అందుకుంటుంటాయి. అందులో ఏదో ఒక చిత్రం మిగతా సినిమాలపై పై చేయి సాధిస్తుంది. అయితే ఎప్పటి లాగానే ఈసారి కూడా బాక్సాఫీస్ దగ్గర భారీ పోటీ నెలకొంది. 2023 సంక్రాంతి కానుకగా మొత్తం నాలుగు సినిమాలు బరిలోకి దిగగా.. ఇందులో రెండు తమిళ సినిమాలు వారిసు, తునివు... రెండు తెలుగు సినిమాలు వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి ఉన్నాయి. నాలుగు కూడా స్టార్ హీరోల సినిమాలు కావడంతో ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకొని థియేటర్లకు పరుగులు తీశారు.

అయితే ఇవన్నీ డీసెంట్ హిట్ టాక్ వచ్చినా.. బాక్సాఫీస్ దగ్గర దుమ్ములేచి పోయేలా కలెక్షన్ల వర్షం కురిపించాయి. విడుదలై 20 రోజులు అవుతున్న ఇంకా థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శిత అవుతున్నాయి. ఇప్పటికే ప్రతి సినిమా దాదాపు 200 కోట్లకు పైగా వసూళ్లను సాధించాయి. అయితే వీటిలో చిరంజీవి వాల్తేరు వీరయ్య భారీగా వసూళ్లు సాధించి అగ్రస్థానంలో నిలిచింది. ఈ నేపథ్యంలో అసలు ఈ సంక్రాంతి పండగ సంక్రాంతి పండగ చరిత్రలో బరిలోకి దిగి ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ -5 చిత్రాలు ఏంటి? వాటి కలెక్షన్ల వివరాలను తెలుసుకుందాం.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్- మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన సూపర్ హిట్ మూవీ అలా వైకుంఠపురం లో. ముఖ్యంగా ఈ చిత్రంలోని పాటలు అంతర్జాతీయ స్థాయిలో ఆడియన్స్ ను ఉర్రూతలూగించాయి. అయితే 2020లో విడుదలైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 256.36 కోట్ల గ్రాస్, 169.37 కోట్ల నెట్ వసూలు చేసి అగ్రస్థానంలో నిలిచింది.

ఇక 2019 లో విక్టరీ వెంకటేష్ మెగా హీరో వరుణ్ తేజ్ కాంబోలో వచ్చిన F2.. 84.51 కోట్ల మార్క్ ని అధిగమించగా టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ ఏకంగా రూ. 142 కోట్లు కలెక్ట్ చేసింది.

ఇక 2020లో వచ్చిన సూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు ప్రపంచవ్యాప్తంగా 222.37 కోట్ల గ్రాస్.. 138.78 కోట్ల షేర్ అందుకుంది. తాజాగా ఈ సంక్రాంతి బరిలో దిగిన చిరంజీవి వాల్తేరు.. వీరయ్య 16 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 216 కోట్ల గ్రాస్.. 126.31కోట్ల షేర్ సాధించింది. ఇక బాలకృష్ణ వీర సింహారెడ్డి 17 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 75.95 కోట్ల షేర్.. 127.85 కోట్ల గ్రాస్ అందుకుంది.