ఫోటో స్టోరి: బన్ని కాదు బందిపోటు

Wed Feb 26 2020 10:45:01 GMT+0530 (IST)

Allu Arjun is acing his airport look in a cool and casual avatar

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఏఏ 20 సెట్స్ కెళ్లేదెపుడు?  బన్ని జాయిన్ అయ్యారా లేదా? ఇదీ అభిమానుల డౌట్. ఇటీవలే `అల వైకుంఠపురములో` చిత్రంతో ఇండస్ట్రీ హిట్ అందుకున్నాడు.  ఆ కిక్ ను పార్టీల పేరుతో ఫుల్ గా ఎంజాయ్ చేసాడు..అటుపై ఫ్యామిలీతో విదేశాల్లో రిలాక్స్ అయి ఇటీవలే మళ్లీ హైదరాబాద్ లో ల్యాండ్ అయ్యాడు. ఇప్పుడు రెట్టించిన ఉత్సాహం లో ఏఏ 20 షూటింగ్ లో పాల్గొనడానికి రెడీ అవుతున్నాడు. అయితే అంతకు ముందే బన్ని ప్రిపరేషన్స్ కి సంబంధించి చేయాల్సినవి కొన్ని ఉన్నాయి.ఏఏ 20 కథాంశం ప్రకారం.. శేషాచలం అడవులు.. ఎర్రచందనం దుంగలు స్మగ్లింగ్ నేపథ్యంలో భారీ అడ్వెంచరస్ యాక్షన్ చిత్రంగా ఇది తెరకెక్కుతుంది. బన్ని పాత్రలో రెండు వేరియేషన్స్ ఉంటాయని ఇప్పటికే లీకులందాయి. అందులో ఒక పాత్రలో నెగిటివ్ షేడ్ కనిపిస్తుందన్న ప్రచారం ఇప్పటికే వేడెక్కిస్తోంది. లారీ డ్రైవర్ గెటప్ లో రగ్గ్ డ్ గా ఊర మాస్ లుక్ లో కనిపించనున్నాడని ప్రచారమవుతోంది.  ప్రస్తుతం ఆ పాత్రకు సంబంధించి చిత్తూరు మాండలింకంలో పూర్తి స్థాయిలో ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. అలాగే లుక్ పరంగా మేకోవర్ ప్రయత్నిస్తున్నాడు. ఇటీవలే చెన్నై పయనమవుతున్న క్రమంలో హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టులో మీడియా కంటికి చిక్కాడిలా.

ఈ లుక్ చూడగానే బన్ని ఏఏ 20 లుక్ ఎలా ఉండబోతుందో ఫ్యాన్స్ ఓ అంచనాకి వచ్చేశారు. ఇప్పటికే మాస్ పాత్ర కోసం గుబురు గడ్డం.. పొడవాటి గిరజాల జుత్తు పెంచుతున్నాడని లీకులు అందాయి. ఆ లుక్ ఇదేనని అర్థమవుతోంది. ఆ హెయిర్ ని ఇలా మంకీ క్యాప్ తో కవర్ చేయడం అందుకే.  ఇలా వెళ్లేప్పుడు క్యాజువల్ టీషర్టు..జీన్స్ ఫ్యాంట్ లో సింపుల్ గా ఉన్నాడు. హెయిర్ మాత్రం ఎక్కడా ఒక్క వెంట్రుక కూడా కనిపించకుండా కవర్ చేసేశాడు. అయితే చెన్నై పయనం దేనికి? ఇంకేదైనా ప్రిపరేషన్ అక్కడ సాగనుందా? అన్నది తెలియాల్సి ఉంది.