Begin typing your search above and press return to search.

బన్నీ ఇక 'స్టైలిష్ స్టార్' కాదు..సుక్కు కొత్తది సెట్ చేసాడు

By:  Tupaki Desk   |   8 April 2021 4:15 AM GMT
బన్నీ ఇక స్టైలిష్ స్టార్ కాదు..సుక్కు కొత్తది సెట్ చేసాడు
X
అల్లు అర్జున్ సినిమాల్లోకి వచ్చినప్పటి నుంచి తనదైన స్టైల్ లో యమా స్టైలిష్ గా ఉంటున్నాడు. అదే మెయింటైన్ చేస్తున్నాడు. బన్ని స్టైల్ ని ఫ్యాన్స్ అనుకరించేలా ఉంటాయి. అందుకోసం ప్రత్యేక శ్రద్ద తీసుకుంటూంటాడు. దాంతో స్టైలిష్ స్టార్ అని బిరుదు సార్థకమైంది. అయితే ఇప్పుడు పుష్ప సినిమాతో మొత్తం మార్చేశాడు సుకుమార్.కొత్త పేరు ను యాడ్ చేసారు. పుష్ప ఇంట్రడక్షన్ టీజర్ చివర్లో దర్శకుడు సుకుమార్ ట్విస్ట్ ఇచ్చాడు. ఇన్నాళ్లుగా స్టైలిష్ స్టార్ గా ఉంటున్న అల్లు అర్జున్ ని ‘పుష్ప’ సినిమాతో సుకుమార్ ‘ఐకాన్ స్టార్’గా మార్చేశాడు. ఆ విషయాన్ని సుకుమార్ తన స్పీచ్ లో మరో సారి స్పష్టం చేసారు.

స్టైలిష్ కు కేరాఫ్ అడ్రస్ అయిన బన్నీ ఈ సినిమాతో ప్యాన్ ఇండియా స్టార్ అయిపోతున్నాడు. అందుకే ఇండియా మొత్తం మాట్లాడుకునేలా ఉండాలని ‘ఐకాన్ స్టార్’ గా పెట్టినట్టు తెలుస్తోంది. ఇక ఇప్పటికే అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ ‘పుష్ప’ టీజర్ రిలీజ్ అయ్యి ఫ్యాన్స్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఊర మాస్ లెవల్ లో అల్లు అర్జున్ చూసిన ఫ్యాన్స్ కు పిచ్చెక్కిపోతోంది. ఈ టీజర్ లో గంధపు చెక్కల స్మగ్లర్ గా అల్లు అర్జున్ ఓ రేంజిలో కనిపించాడు. ఫ్యాన్స్ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఈ టీజర్ వచ్చింది.

సుకుమార్ ఈ సినిమాలో అల్లు అర్జున్ క్యారక్టర్ కు తగ్గట్టుగా పూర్తిగా గెటప్ మార్చేశారు. ఇప్పటిదాకా ఈ స్దాయిలో బన్ని పూర్తిగా మారింది లేదు. మరో వైపు టీజర్ చూస్తుంటే ఒకవైపు పోలీసులతో మరోవైపు ప్రత్యర్థి ముఠాలతో పోరాటమే ప్రధానంగా సాగుతుందని అర్థమవుతుంది. ముఖ్యంగా విజువల్స్ అద్భుతంగా చూపించాడు. అంతే కాకుండా ఈ టీజర్ లో హీరోయిన్ రష్మిక మందన్న ను కూడా పరిచయం చేశాడు సుకుమార్.

కనపడింది కొద్ది సెకన్లే అయినా లంగా ఓణీ లో పల్లెటూరి అమ్మాయి గా రష్మిక మందన్న లుక్ అదిరిపోయింది. సినిమా ప్రారంభం నుంచీ భారీ అంచనాలు ఈ సినిమాపై ఉన్నాయి. తాజాగా విడుదలైన టీజర్ తో ఆ ఎక్సపెక్టేషన్స్ మరింత ఎక్కువయ్యేలా చేసింది. టీజర్ చూసిన అభిమానులు సైతం సుకుమార్ బన్నీ హ్యాట్రిక్ హిట్ కొట్టడానికి సిద్ధంగా ఉన్నారని ఫిక్సైపోయారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రముఖ మలయాళ నటుడు ఫాజిల్ ఫహాద్ విలన్ గా చేస్తున్నాడు. మళయాళంలో రచ్చ ఎలా ఉంటుందో ఊహించండి మరి.